తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. రోజుల వ్యవధిలోనే ప్రముఖులు కన్ను మూస్తున్నారు. రెండు రోజుల క్రితం ముత్యాలముగ్గు ఫేమ్ వెంకటేశ్వర రావు మృతి చెందారు. ఆ విషాదం నుంచి కోలుకోకముందే మరో ప్రముఖుడు కన్ను మూశారు. ఆ వివరాలు.. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్పీ ఈశ్వర్‌రావు అనారోగ్యంతో చెన్నైలో కన్నుమూశారు. 63 ఏళ్ళ వయసులో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ మరణించారు. ఈశ్వర్ రావు ఒకప్పటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్పీ కోదండపాణి కుమారుడు.
తమిళ, తెలుగు భాషల్లో ఎన్నో సినిమాలకి ఈశ్వర్ రావు సంగీతం అందించారు. దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమాలకు ఎక్కువగా సంగీత సహకారం అందించారు. సినిమాలకే కాక సీరియల్స్ కి కూడా సంగీతం అందింఆచరు. ఈటీవీలో ప్రసారం అయ్యే అంతఃపురం,శుభలేఖ,జీవితం లాంటి పలు సీరియళ్లకు ఈయన మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈశ్వర్ రావు మరణంతో తమిళ, తెలుగు సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలముకున్నాయి.ఈ విషయం తెలుసుకున్న సనీ ప్రముఖులు ఈశ్వర్ రావ్ కు నివాళులు అర్పిస్తున్నారు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.