ఒక దశాబ్దకాలం పాటు తమ పాటలతో కుర్రకారును హోరెత్తించారు రాజ్- కోటిల ద్వయం . టాప్ హీరోలు కూడా వీరితో సినిమాలు చేసేందుకు వేచి చూశారంటే అతిశయోక్తి లేదు. అయితే తర్వాత విబేధాలు వచ్చి రాజ్ , కోటిలు విడిపోయారు. వీరిలో కోటి తర్వాత సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్‌గా కొనసాగారు. అయితే ఇప్పుడు ఆయనకు అరుదైన గౌరవం దక్కింది.
తెలుగు సినిమా చరిత్రలో సంగీత ద్వయంగా గుర్తింపు తెచ్చుకున్నారు రాజ్-కోటి. ఓ మూస పద్ధతిలో సాగిపోతున్న టాలీవుడ్ సంగీతాన్ని కొత్త పుంతలు తొక్కించారు. వీరిద్దరూ కలిసి అనేక సినిమాలకు స్వర కల్పన చేశారు. వీరిద్దరూ సుమారు 180 సినిమాలకు కలిసి పనిచేశారు. ఒక దశాబ్దకాలం పాటు తమ పాటలతో కుర్రకారును హోరెత్తించారు. టాప్ హీరోలు కూడా వీరితో సినిమాలు చేసేందుకు వేచి చూశారంటే అతిశయోక్తి లేదు. అయితే తర్వాత విబేధాలు వచ్చి రాజ్ , కోటిలు విడిపోయారు. వీరిలో కోటి తర్వాత సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్‌గా కొనసాగారు. రాజ్ కొన్ని సినిమాలు చేశారు.. కానీ ఆ సినిమాలు ఆడకపోవడంతో ఇండస్ట్రీ నుండి దూరం జరిగారు. ఇటీవల ఆయన కన్నుమూసిన సంగతి విదితమే. హలో బ్రదర్ నుండి సినిమాలు చేస్తూనే ఉన్నారు. మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎన్నో నంది అవార్డులు గెలుచుకున్నారు. కోటి మరెవ్వరో కాదూ.. ఎన్నో సినిమాలకు సంగీతం అందించిన సాలూరి రాజేశ్వరరావు కుమారుడే.
కాగా, కోటికి అరుదైన గౌరవం దక్కింది. తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటిసారి ఒక సంగీత దర్శకుడికి ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ పార్లమెంట్‌లో గౌరవ జీవిత సాఫల్య పురస్కారం దక్కింది. న్యూ సౌత్ వేల్స్ పార్లమెంట్‌లో జరిగిన సెలబ్రేషన్ ఆఫ్ మ్యూజిక్ కార్యక్రమంలో భాగంగా కోటి.. తెలుగు సినిమా సంగీతానికి చేసిన సేవకు గుర్తింపుగా జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. మెంబర్ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ పార్లమెంట్ జూలియా ఫిన్ (ఎంపీ).. ఈ పురస్కారాన్ని కోటికి అందజేశారు. పురస్కారంలో భాగంగా కోటికి ఒక జ్ఞాపిక, ప్రశంసా పత్రం బహూకరించారు. దాన్ని స్వీకరించిన కోటి.. భారతీయులకు, ఐక్యరాజ్య సమితి సభ్యలకు కృతజ్ఞతలు తెలిపారు. భారత దేశానికి ఈ పురస్కరాన్ని అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రసంగం చివరిలో జైహింద్ అంటూ నినదించారు. దేశానికి తన పురస్కారాన్ని అంకితమివ్వడంతో జాతి పట్ల తనకున్న కృతజ్ఞతను గౌరవాన్ని బాధ్యతను చాటుకున్నారు.కోటికి పురస్కారం రావడం పట్ల భారతీయులు హర్షం వ్యక్తం చేస్తూ.. అభినందనలు తెలుపుతున్నారు.