టెస్టు టీమ్ నుంచి రాహుల్ ఔట్! సూర్య కుమార్ యాదవ్ కి పిలుపు!

suryakumar yadav

న్యూజిలాండ్‌ తో టెస్టు సిరీస్‌ ముంగిట టీమిండియాకు భారీ షాక్‌ తగిలింది. టెస్టు టీమ్ నుంచి స్టార్‌ ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ తప్పుకున్నాడు. ఎడమ తొడ కండరాలు పట్టేయడంతో అతను టెస్టు స్క్వాడ్‌ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అతను న్యూజిలాండ్‌ తో రెండు టెస్టులకు అందుబాటులో ఉండడని బీసీసీఐ వెల్లడించింది. అతని స్థానంలో సూర్యకుమార్‌ యాదవ్‌ ను టెస్టు టీమ్‌ లోకి తీసుకోనున్నట్లు ప్రకటించింది.

టెస్టు స్క్వాడ్‌..

అజింక్య రహానే(కెప్టెన్‌), మయాంక్‌ అగర్వాల్‌, ఛతేశ్వర్‌ పుజారా, శుభ్‌ మన్‌ గిల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, వృద్ధిమాన్‌ సాహా, కేఎస్‌ భరత్‌, రవీంద్ర జడేజా, అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, జయంత్ యాదవ్‌, ఇషాంత్‌ శర్మ, ఉమేష్‌ యాదవ్‌, సిరాజ్‌, ప్రిసిద్ధ్‌ కృష్ణ