ఐపీఎల్లో కోత్కత్తా నైట్ రైడర్స్ జట్టును విజయవంతం నడిపించిన కెప్టెన్ గౌతమ్ గంభీర్. ఆ జట్టుకు 2012, 2014లో ఐపీఎల్ టైటిల్‌ను గెలిపించాడు. అలాగే 2016లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిషేధం కారణంగా పాల్గొనలేదు. ఆ సమయంలో ధోని రైజింగ్ పుణె సూపర్ జెయింట్ జట్టుకు సారథిగా వ్యవహరించాడు. ఆ సీజన్లో కేకేఆర్, సీఎస్కే మధ్య జరిగిన ఒక మ్యాచ్‌లో ఆసక్తికరమైన సంఘటన ఒకటి చోటు చేసుకుంది.
ఆ సమయంలో ధోని అంటే గంభీర్‌కు అస్సలు పడదనే బహిరంగ రహస్యం ఒకటి ఉంది. దాని కారణంగానే ఒక సారి ధోని బ్యాటింగ్‌కు వచ్చిన సమయంలో గంభీర్ టెస్టు మ్యాచ్ స్టైల్లో ఆరుగురు ఫీల్డర్లను ధోని చుట్టూ మొహరించాడనే వాదన ఉంది. ఏ ఫార్మాట్ అయినా ధోని కొంత సమయం తీసుకుని హిట్టింగ్ మొదలుపెడుతాడు. ఇదే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని గంభీర్‌ను రాగానే అవుట్ చేద్దామని ఫీల్డర్లను దగ్గరగా పెట్టాడు. అప్పట్లో ఈ ఫీల్డింగ్‌పై తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. కాగా ఇప్పుడు ఆ విషయాన్ని మరోసారి ప్రస్తావిస్తూ.. ధోని బ్యాటింగ్ చేస్తుండగా ఆరుగురు ఫీల్డర్లు చుట్టూ ఉన్న ఫొటోను కేకేఆర్ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేసింది.
@imjadeja rockss 🤣🤣 pic.twitter.com/bgKcwFvEaw
— Bhavesh Lodha (@bhav2406) January 10, 2022
నిన్న జరిగిన యాషెస్ సిరీస్ నాలుగో టెస్టు చివరి రోజు కూడా ఇంగ్లండ్ బౌలర్లు బ్యాటింగ్‌కు వచ్చిన టైమ్‌లో ఆస్ట్రేలియా వారిని అవుట్ చేసేందుకు ఫీల్డర్లను దగ్గరగా పెట్టింది. 2016లో ధోని కోసం గంభీర్ పెట్టిన ఫీల్డింగ్‌ను కంప్యార్ చేస్తూ ఒక ఫొటోను పోస్టు చేసింది. ఈ ఫొటోకు టెస్టు క్రికెట్లో ఈ క్లాసిక్ మూవ్ టీ20 ఫార్మాట్లో మాస్టర్ స్ట్రోక్‌ను గుర్తుకు తెస్తుందంటూ దీనికి ఓ క్యాప్షన్ కూడా పెట్టింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోపై ధోని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Aukaat pic.twitter.com/Ig9lBcrXtd
— Shubham (@golchiee) January 10, 2022
తాజాగా టీమిండియా ఆల్‌రౌండర్, ధోని సహచరుడు రవీంద్ర జడేజా ఈ ఫొటోపై స్పందించాడు. కేకేఆర్ ట్వీట్‌కు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చాడు. అది మాస్టర్ స్ట్రోక్ కాదు.. షో ఆఫ్ మాత్రమే అంటూ రాసుకొచ్చాడు. కేకేఆర్‌కు పోస్టుకు జడేజా రిప్లై ఇచ్చినట్లు ఉన్నా.. వాస్తవానికి అది గంభీర్‌కు తగిలేలా ఉంది. గంభీర్‌ది కేవలం షో ఆఫ్ అన్నట్లు జడేజా అన్నట్లు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.కాగా జడేజా ఇచ్చిన ఈ కౌంటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి కేకేఆర్ పోస్టుపై, జడేజా కౌంటర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: హీరో విజయ్ కి సర్ప్రైజ్ ఇచ్చిన ధోని. పిక్స్ వైరల్