2000 కోళ్లు దిగుమతి చేసుకున్న ధోని.. ఎందుకో తెలుసా?

MS dhoni buy kadaknath hens

టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనికి బైకులంటే ఇష్టమన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ.. ధోనికి కోళ్లు పెంచడమంటే ప్రాణామని చాలా మందికి తెలియదు. కోళ్ల పెంపకంపై ఇష్టమేకాదు. నిజంగానే ధోని కోళ్లు పెంచుతున్నాడు. ఒకటి రెండు కాదు.. ఏకంగా రెండు వేల కోళ్లను పెంచుతున్నాడు ధోని. కరోనా లాక్‌డౌన్‌ కంటే ముందే ధోని మధ్యప్రదేశ్‌లోని ఝూబువాకు చెందిన ఒక సహకార సంఘం నుంచి ధోని రెండు వేల కోళ్లను కొనుగోలు చేసినట్లు ఆ జిల్లా కలెక్టర్‌ తెలిపారు.

ఈ మధ్యనే అవి మధ్యప్రదేశ్‌ నుంచి ప్రత్యేక వాహనంలో రెండువేల కోళ్లను రాంచీలోని ధోని ఫామ్‌కు పంపినట్లు ఆయన తెలిపారు. కాగా.. కడక్‌నాథ్‌ కోళ్లు మొత్తం నల్లగా ఉంటాయి. వీటిలో పోషక గుణాలు ఎక్కువ. అందుకే వీటి గుడ్లకు, మాంసానికి అధిక ధరతోపాటు మంచి డిమాండ్‌ ఉంటుంది. మరి ధోని కోళ్ల పెంపకంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ధోని ఫీల్డింగ్‌ సెట్‌ చేస్తే ఇలా ఉంటది! ఇంచు కదలకుండా క్యాచ్‌ వచ్చింది

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.