నాలాంటి ముసలోడికి కష్టమే అంటున్న ఏబీ డెవిలియర్స్‌

Mr.360

కరోనా కారణంగా ఆగిపోయిన ఐపీఎల్‌ 2021 సెకెండ్‌ హాఫ్‌ ప్రారంభం కాబోతోంది. యూఏఈ వేదికగా అప్పుడే సందడి మొదలైపోయింది. ఇప్పటికే క్వారంటైన్‌ పూర్తి చేసుకుని ఆటగాళ్లు నెట్స్‌లో ప్రాక్టీస్‌ మొదలెట్టారు. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కూడా నెట్స్‌లోకి అడుగుపెట్టింది. మిస్టర్‌ 360 డిగ్రీస్‌ ఏబీ డెవిలియర్స్‌ కూడా బ్యాటుకు పనిచెప్పాడు. తనదైన షాట్స్‌తో నెట్స్‌లో సందడి చేశాడు.

‘మళ్లీ చాలా కాలం తర్వాత అందరు ఆటగాళ్లను ఒకే దగ్గర చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇక్కడి పరిస్థితులు బాగానే ఉన్నాయి. ఇక్కడి వికెట్‌ కొంచం కష్టంగానే ఉంది. వాతావరణంలో ఆర్ద్రత(హ్యుమిడిటీ) ఎక్కువగానే ఉంది. నాలాంటి(37) ముసలివాడికి ఈ వాతావరణం కష్టంగానే ఉంటుంది. చెమట ఎక్కువగా పడుతోంది. దానికి అనుగుణంగా నేను సిద్ధంగా ఉండాలి’ అంటూ ఏబీడీ చెప్పుకొచ్చాడు. ‘ ఈ సెషన్‌ బాగా సాగింది. రేపటి వార్మప్‌ మ్యాచ్‌ కోసం సిద్ధమవుతున్నాం’ అని ఏబీడీ తెలిపాడు.