వరల్డ్ కప్ కి ఇంకా 50 రోజుల సమయం ఉన్నా ప్రస్తుతం అందరి దృష్టి ఈ మెగా టోర్నీ మీదే ఉంది. ఇదిలా ఉండగా.. తాజాగా వరల్డ్ కప్ లో ఏ జట్లు సెమీస్ కి వెళ్తాయో సౌత్ ఆఫ్రికా మాజీ లెజెండ్ ఏబీ డివిలియర్స్ తన అభిప్రాయాన్ని చెప్పేసాడు.
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న వరల్డ్ కప్ కి సమయం దగ్గర పడుతుంది. భారత్ వేదికగా అక్టోబర్ లో ఈ టోర్నీ జరగనున్న సంగతి తెలిసిందే. తొలిసారి టీమిండియా పూర్తిస్థాయిలో వరల్డ్ కప్ ని నిర్వహించడం విశేషం. గతంలో ఇండియాలో వరల్డ్ కప్ మ్యాచులు జరిగినా అప్పుడు పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ తో కలిసి సంయుక్తంగా ఆతిధ్యమిచ్చింది. సొంత గడ్డపై వరల్డ్ కప్ జరగనుండడంతో అభిమానుల అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. పైగా చివరి మూడు వరల్డ్ కప్ లు చూసుకుంటే ఆతిధ్య జట్లే గెలవడం విశేషం. అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీ నవంబర్ 19 న ముగుస్తుంది. ఇదిలా ఉండగా ఇప్పటికే వరల్డ్ కప్ లో ఏ జట్లు సెమీస్ కి వెళ్తాయో అనేదానిపై కొంతమంది ఎక్స్ పర్ట్స్ జోస్యం చెప్పగా.. తాజాగా సౌత్ ఆఫ్రికా మాజీ లెజెండ్ ఏబీ డివిలియర్స్ కూడా తన అభిప్రాయాన్ని చెప్పేసాడు.
వరల్డ్ కప్ కి ఇంకా 50 రోజుల సమయం ఉన్నా ప్రస్తుతం అందరి దృష్టి ఈ మెగా టోర్నీ మీదే ఉంది. ప్రపంచ కప్‌పై అప్పుడే ప్రెడిక్షన్స్ కూడా మొదలయ్యాయి. జట్ల కాంబినేషన్‌తో పాటు ఏ టీమ్ ఎక్కడి వరకు వెళ్లగలదు అనేది అంచనా వేసేస్తున్నారు. దీన్ని బట్టే మెగా టోర్నీ మీద బజ్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే వరల్డ్ కప్ పై తొలిసారి స్పందించిన దక్షిణాఫ్రికా మాజీ స్టార్ బ్యాటర్ డివిలియర్స్ భారత్‌తో పాటు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లు సెమీఫైనల్‌కు చేరతాయని జోస్యం పలికాడు. అయితే పాకిస్థాన్ జట్టు బలంగా ఉన్నప్పటికీ దాయాది దేశం సెమీస్ కి వెళ్ళదని షాకిచ్చాడు. ఈ సందర్భంగా యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడిన ఎబీ.. తన స్నేహితుడు కోహ్లీ గురించి వరల్డ్ కప్ గురించి తన మనసులో మాటలు పంచుకున్నాడు.
“భారత్ వేదికగా జరగబోయే వరల్డ్ కప్‌లో విరాట్ కోహ్లీ చెలరేగితే టీమిండియా టైటిల్ గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. విరాట్ రాణించడం పైనే టీమిండియా విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. భారత్‌తో పాటు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లు సెమీఫైనల్‌కు చేరతాయి. ఇక వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడే అవకాశం ఉంది. కోహ్లీ నా ఫేవరెట్ ఐపీఎల్ బ్యాటర్. అతడితో కలసి బ్యాటింగ్ చేయడాన్ని ఆస్వాదిస్తాను”. అని ఈ సందర్భంగా ఈ మిస్టర్ 360 తెలియజేశాడు. మరి డివిలియర్స్ చెప్పినట్లుగా ఈ నాలుగు జట్లు వెళతాయో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.