‘ఐపీఎల్ 2022’ నిర్వహణ కోసం బీసీసీఐ రంగం సిద్ధం చేస్తోంది. దాదాపు డిసెంబరు నెలలో మెగా ఆక్షన్ ఉండే అవకాశం ఉంది. ఐపీఎల్ 15 సీజన్ లో కొత్తగా రెండు ఫ్రాంచైజీలు వస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు రిటైనింగ్ రూల్స్ ను కూడా బీసీసీఐ మార్చింది. లక్నో, అహ్మదాబాద్ ఎంట్రీతో వేలం కూడా మంచి ఉత్కంఠంగా మారే అవకాశం ఉంది. వచ్చే సీజన్ ఎప్పుడు అన్నదానిపై ఇంకా క్లారిటీ లేదు. ఎక్కడా కూడా అధికారిక వార్తలు రాలేదు. కానీ, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఏప్రిల్ 2, 2022న ఐపీఎల్ సీజన్ 15 ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
వచ్చే సీజన్ మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్- ముంబయి ఇండియన్స్ మధ్య జరగనుందని తెలుస్తోంది. చెపక్ వేదికగా ఈ మ్యాచ్ నిర్వహించనున్నట్లు సమాచారం. ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే ధోనీ ఈ మ్యాచ్ తర్వాత ఐపీఎల్ కు కూడా వీడ్కోలు పలుకుతాడని తెలుస్తోంది. మొదటి నుంచి ధోనీ చెప్తున్న మాట చెన్నైలోనే తన చివరి మ్యాచ్ ఉంటుందని. మరి ఆ మ్యాచ్ తర్వాత ధోనీ వీడ్కోలు పలుకుతాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇంకో ఐదేళ్లు అయినా సరే తన చివరి మ్యాచ్ మాత్రం చెన్నై వేదికగానే ఉంటుందని ముందే ప్రకటించాడు ధోనీ. ఇప్పుడు మాత్రం ఐపీఎల్ సీజన్ 15 మొదటి మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ తో తలపడిన తర్వాత ధోనీ చెపక్ స్టేడియంలో తన ఐపీఎల్ కెరీర్ కు వీడ్కోలు పలుకుతాడని తెలుస్తోంది. ఈ విషయంపై క్లారిటీ రావాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే. ధోనీ వచ్చే సీజన్ లో రిటైర్మెంట్ తీసుకునే అవకాశం ఉందా? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.