మోస్ట్‌ వాల్యుబుల్‌ ప్లేయర్స్‌ ఆఫ్‌ టీ20 వరల్డ్‌ కప్‌ జట్టును ప్రకటించిన ఐసీసీ..

icc t20 world cup trophy

‘ఐసీసీ టీ20 వరల్డ్‌ కప్‌ 2021’ ముగిసింది. కొత్త ఛాంపియన్‌ గా ఆస్ట్రేలియా అవతరించింది. ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌గా డేవిడ్‌ వార్నర్‌ నిలిచాడు. ఫైనల్‌ లో న్యూజిలాండ్‌ ను చిత్తుగా ఓడించింది ఆస్ట్రేలియా. 172 భారీ లక్ష్యాన్ని కూడా సునాయాసంగా చేరుకుంది. కేవలం 18.5 ఓవర్లలోనే ఆస్ట్రేలియా ఈ లక్ష్యాన్ని సాధించింది. మెయిడెన్‌ టీ20 వరల్డ్‌ కప్‌ ను సొంతం చేసుకుంది. న్యూజిలాండ్‌ కు మాత్రం టీ20 వరల్డ్‌ కప్ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. టీ20 వరల్డ్‌ కప్‌ ముగియడంతో ఐసీసీ మోస్ట్‌ వాల్యూబుల్‌ ప్లేయర్స్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌ లిస్టును ప్రకటించింది. ఇందులో మరింత నిరాశ కలిగించే విషయం ఏంటంటే వాళ్లు ఎంపిక చేసిన 12 మంది ఆటగాళ్లలో ఒక్క టీమిండియా ప్లేయర్‌ కూడా లేరు.

icc t20 world cup trophyఆ 12 మంది ఆటగాళ్లలు..

మోస్ట్‌ వాల్యుబుల్ టీమ్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌ లో చోటు దక్కించుకున్న ఆటగాళ్లు: డేవిడ్‌ వార్నర్‌(ఆస్ట్రేలియా), జోస్‌ బట్లర్‌(ఇంగ్లాండ్‌), బాబర్‌ అజమ్‌(పాకిస్తాన్‌), అసలంక(శ్రీలంక), మార్కరం(సౌతాఫ్రికా), మెయిన్‌ అలీ(ఇంగ్లాండ్‌), హసరంగ(శ్రీలంక), ఆడమ్‌ జంపా(ఆస్ట్రేలియా), హేజల్‌ వుడ్‌(ఆస్ట్రేలియా), బౌల్ట్‌(న్యూజిలాండ్‌), నోర్ట్జే(సౌతాఫ్రికా), పన్నెండో ప్లేయర్‌ గా షాహీన్‌ అఫ్రీదీకి చోటు దక్కింది. బాబర్‌ అజమ్‌ ను కెప్టెన్‌ గా ఎంచుకున్నారు. ఈ టోర్నమెంట్‌ లో పాకిస్తాన్‌ ఆడిన ఐదు మ్యాచ్‌ లు గెలిచింది. అందుకే మోస్ట్‌ సక్సెస్‌ ఫుల్‌ కెప్టెన్‌ బాబర్‌ అజమ్ కాబట్టి.. ఐసీసీ కూడా కెప్టెన్సీని బాబర్‌ కే అప్పగించింది.

icc t20 world cup trophyఅత్యధికంగా ఇంగ్లాడ్‌ ఆటగాళ్లు ముగ్గురికి చోటు దక్కింది. ఆ తర్వాత ఇద్దరు ఆస్ట్రేలియా, ఇద్దరు శ్రీలంక, ఇద్దరు సౌతాఫ్రికా ప్లేయర్లు చోటు సంపాదించారు. న్యూజిలాండ్‌ నుంచి కేవలం బౌల్ట్‌ కు మాత్రమే చోటు దక్కింది. టీమిండియా ఆటగాళ్లకు చోటు దక్కకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్‌ చేయండి.icc t20 world cup trophy