మహిళల బిగ్‌ బాష్‌ లీగ్‌ లో హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ అద్భుత ప్రదర్శన..

harmanpreet kaur

టీమిండియా మహిళా టీ20 జట్టు కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ విదేశీ గడ్డపై అరుదైన ఘనత సాధించింది. మహిళల బిగ్‌ బ్యాష్‌ లీగ్‌ 2021 ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌ గా నిలిచింది. ఆ ఘనత సాధించిన తొలి భారత మహిళా క్రికెటర్‌ గా రికార్టు సృష్టించింది. పెర్త్‌ స్కోర్చెర్స్‌ కు చెందిన సోఫీ డెవైన్‌, బెత్‌ మూనీలను వెనక్కు తోసి 31 ఓట్లతో ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌ గా అవతరించింది.

దాదాపు రెండేళ్ల విరామం తర్వాత బిగ్‌ బ్యాష్‌ లో అడుగుపెట్టిన హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ మంచి ఫామ్‌ ను కొనసాగించింది. 11 ఇన్నింగ్స్‌ లో 66.5 బ్యాటింగ్‌ యావరేజ్‌ తో 399 పరుగులు చేసింది. అంతేకాదు బౌలింగ్‌ లోనూ తన మార్కును ప్రదర్శించింది. మొత్తం 15 వికెట్లు తీసి బాల్‌ తోనూ మెరిసింది. అంతేకాకుండా 18 సిక్సులు బాది.. సిక్స్‌ హిట్టింగ్‌ లిస్ట్‌ లో టాప్‌ ప్లేస్‌ లో ఉంది. ఇటీవల ఇండియా తరఫున ప్రదర్శనల్లో కాస్త తడబడినా.. బిగ్‌ బ్యాష్‌ లీగ్‌ లో మాత్రం తను భీకర ఫామ్‌ ను చూపించింది. బిగ్‌ బ్యాష్‌ లీగ్‌ లోనూ కాస్త అస్వస్థతకు గురైనా.. ప్రస్తుతం మాత్రం ఫిట్‌ గా ఉన్నానని హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ వెల్లడించింది.