టీ20 ప్రపంచకప్‌ జట్టులోకి యుజ్వేంద్ర చాహల్‌ వస్తాడంటున్న మాజీ స్పిన్నర్‌!

chahal

ఐపీఎల్‌ 2021 ముంగింపు దశకు చేరుతుండటంతో ఇప్పుడు అందరి దృష్టి ఐసీసీ టీ20 వరల్డ్‌ కప్‌పైకి మళ్లింది. ఇప్పటికే అన్ని దేశాలు ఐపీఎల్‌, సీపీఎల్‌, వ్యక్తిగత ప్రాక్టీస్‌తో మంచి హుషారుగా ఉన్నాయి. అన్ని టీమ్‌లు తమ స్క్వాడ్‌ని ప్రకటించాయి. బీసీసీఐ కూడా 15 సభ్యులతో తమ బృందాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ జట్టులో స్పిన్‌ మాంత్రికుడు యుజ్వేంద్ర చాహల్‌ పేరు లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు చేరిందంటే అందులో చాహల్‌ పాత్ర కూడా ఎంతో ఉంది. కానీ, అతని పేరు తుది జట్టులో లేకపోయే సరికి అందిరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ విషయంపై సెహ్వాగ్‌ వంటి మాజీలు తమ అసంతృప్తిని కూడా వెళ్లగక్కారు. ఇప్పుడు ఆ జాబితాలోకి మాజీ స్పిన్నర్‌ హర్భజన్‌ కూడా చేరాడు.

ఉత్తమ ఫామ్‌ కనబరుస్తున్న యుజ్వేంద్ర చాహల్‌ పేరు టీ20 జట్టులో లేకపోయసరికి హర్భజన్‌ సింగ్‌ కూడా ఆశ్చర్యానికి గురయ్యాడు. అక్టోబరు 10 వరకు జట్టులో మార్పులు చేసేందుకు అవకాశం ఉంది. ఇప్పటికే ఎంపికైన వారిలో కొందరి ప్రదర్శన అంత చక్కగా నేనందున చాహల్‌కు చోటుదక్కుతుందేమో అని బజ్జీ భావిస్తున్నాడు. ఆ విషయయంలో తన అభిప్రాయాన్ని ట్వీట్‌ చేశాడు. ‘నువ్వు ఎప్పటిలాగే అత్యుత్తమంగా ఉన్నావు. నీ ఈ ఫామ్‌ని కొనసాగించు. నెమ్మదిగా బౌలింగ్‌ చేయకు. సరైన వేగంతో బౌలింగ్‌ చేస్తున్నావని నిర్ధారించుకో. టీ20 ప్రపంచకప్‌ టీమిండియా జట్టులో నిన్ను చూడాలని ఆశిస్తున్నా. ఛాంపియన్‌ బౌలర్‌’ బజ్జీ చెప్పుకొచ్చాడు. చాహల్‌ తప్పకుండా జట్టులోకి వస్తాడని అందరూ భావిస్తున్నారు. ఈ విషయంలో కోహ్లీ కూడా పట్టుబట్టినట్లు సమాచారం. చాహల్‌ ప్రస్తుత ప్రదర్శన ఆధారంగానే తప్పకుండా అతనికి చోటు దక్కుతుందనే భావన కనిపిస్తోంది.