‘ఇంగ్లాడ్‌ మాజీ ఓపెనర్‌’కి సరదా తీర్చేసిన కోహ్లీ ఫ్యాన్స్‌!

టైమ్ ఎప్పుడు ఒకేలా ఉండదు. మన టైమ్‌ నడుస్తుంది కదా అని నోరు పారేసుకుంటే.. కాలం ఒక్కోసారి దూల తీర్చేస్తుంది. ఎప్పుడూ టీమిండియా అన్నా, ఇండియన్‌ క్రికెట్‌ అభిమానులన్నా, కింగ్‌ కోహ్లీ అన్నా ట్వీట్లేసుకు పడే ఇంగ్లాండ్‌ మాజీ ఓపెనర్‌ నిక్‌ కాంప్టన్‌కు కోహ్లీ ఫ్యాన్స్‌ సరదా తీర్చేశారనే చెప్పాలి. ఓవల్‌ వేదికగా నాలుగో రోజు ఇంగ్లీష్‌ బ్యాట్స్‌మన్లు వికెట్‌ కోల్పోకుండా 77 పరుగులు సాధించి ఒకానొక సమయంలో టెస్టు గెలుస్తారేమో అన్న నమ్మకాన్ని కలిగించారు. ఇక, మన నిక్‌ కాంప్టన్‌ ట్విట్టర్‌ మేకపోతు గాంభీర్యంతో ‘కోహ్లీ ఇండియన్‌ లవింగ్‌ ఫ్యాన్స్‌ ఎక్కడికి వెళ్లారు’ అంటూ ట్వీట్‌ చేశాడు.

ఆ సమయానికి ఎవరూ అంతగా స్పందిచలేదు కానీ, ఐదో రోజు ఆటలో భారత్‌ ఆధిపత్యం చూసి ట్విట్టర్‌లో నిక్‌ కాంప్టన్‌పై కోహ్లీ అభిమానులు విరుచుకుపడ్డారు. వరుస ట్వీట్లతో అతనిని ఆడేసుకున్నారు. ఎక్కువ మంది అభిమానులు కింగ్‌ కోహ్లీ సెలబ్రేషన్‌ ఫొటోలతో నిక్‌కు సమాధానం చెప్పారు. కొందరైతే కోహ్లీ కామెంట్స్‌, రియాక్షన్స్‌ను హైలెట్‌ చేస్తూ సమాధానమిచ్చారు. చివరికి నిక్‌ కాంప్టన్‌ కూడా నేను ఇంగ్లాండ్‌ టీమ్‌ ఎక్కవగా అంచనావేశాను అంటూ నాలుక కరుచుకున్నాడు. మరి, నిక్‌కు ఆ రేంజ్‌లో చుక్కులు చూపించిన కోహ్లీ ఫ్యాన్స్‌ ట్వీట్లు మీరు చూసేయండి.