కుక్కకు ప్లేయర్‌ ఆఫ్ ది మంత్‌ అవార్డు ప్రకటించిన ఐసీసీ

సాధారణంగా మంచి ప్రతిభ కనబర్చిన ఆటగాళ్లకు ఇంటర్నేషల్‌ క్రికెల్‌ కౌన్సిల్‌ అవార్డులు ప్రకటిస్తుంది. ఐసీసీ అవార్డు ఆఫ్‌ది మంత్‌ అనేది కూడా పలు అవార్డులో ఒకటి. కాగా సెప్టెంబర్‌ నెలకు గాను ప్రకటించిన అవార్డు సంచలనంగా మారింది. క్రికెట్‌ మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో మైదానంలోకి దూసుకొచ్చి, ఆటగాళ్లకు అందకుండా ఫీల్డింగ్‌చేసి, మైదానంతా నవ్వులు పూయించిన పెంపుడు శునకానికి ఈ సారి ఐసీసీ డాగ్‌ ఆఫ్‌ది మంత్‌ అవార్డు ఇచ్చింది. ఈ విషయాన్ని ఐసీసీ తన ట్వీట్టర్‌ ఖాతాలో తెలిపింది. ఈ నెల 13న ఐర్లాండ్‌ మహిళల క్రికెట్‌ మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో ఒక శునకం గ్రౌండ్‌లోకి దూసుకొచ్చింది. బ్యాటర్‌ కొట్టిన బంతిని ఫీల్డర్‌కు దొరకుండా నోటితో కర్చుకుని గ్రౌండ్‌లతో మెరుపువేగంతో పరిగెత్తి నాన్‌స్రైకర్‌కు బంతిని అందజేసింది.

ICC announces Player of the Month award for dog - Suman TVఇది చూసిన ఆటగాళ్లు, ప్రేక్షకులు ఆశ్చర్యపోయాయి. నవ్వుల్లో మునిగితేలారు. దాని వెనుకే వచ్చిన ఆ కుక్క యజమాని దాన్ని గ్రౌండ్‌ బయటకు తీసుకెళ్లారు. ఇదే విషయాన్ని ఐసీసీ సోమవారం తన ట్వీట్టర్‌ ఖాతాలో మైదానంలో అసాధారణమైన అథ్లెటిజం అంటూ శుకనం చేసిన ఫీల్డింగ్‌ను పోస్టు చేసింది. అదికాస్తా వైరల్‌ అయింది. మంగళవారం నాడు ఆ శునకానికి ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డు ప్రకటిస్తున్నట్లు ఐసీసీ తన ట్వీట్టర్‌లో వెల్లడించింది. ఈ సారి అదనపు ప్లేయర్‌కు అవార్డు ప్రకటిస్తున్నట్లు పేర్కొంది. డ్యాజిల్‌ ది డాగ్‌.. డాగ్‌ ఆఫ్‌ ది మంత్‌ గా పేర్కొంటూ అవార్డు ఇచ్చింది. తన పెంపుడు కుక్కకు అవార్డు రావడం పట్ల దాని యజమాని ఆనందం వ్యక్తం చేశారు. దీంతో నెట్టింట ఈ విషయం వైరలైపోయింది.