ధనంజయ డి సిల్వా ఔటైన తీరు చూసి.. జాలిపడుతున్న నెటిజన్లు

Danunjay Disilva Srilanka

వెస్టిండీస్‌- శ్రీలంక మధ్య జరుగుతున్న టెస్టులో ఆసక్తికర ఘటన జరిగింది. శ్రీలంక బ్యాట్సమన్‌ ధనంజయ డి సిల్వా(61) అత్యంత దురదృష్టకరంగా పెవిలియన్‌ చేరాడు. మంచి ఫామ్‌ లో ఉన్న ధనంజయ సిల్వా అలా ఔటవ్వడం చూసి శ్రీలంక అభిమానులే కాదు. నెటిజన్లు కూడా జాలిపడుతున్నారు. ఆ విజువల్స్‌ బాగా వైరల్‌ అవతున్నాయి.

95వ ఓవర్‌ వేసేందుకు వెస్టిండీస్‌ బౌలర్‌ గాబ్రియెల్ బంతిని అందుకున్నాడు. వేగంగా రెండో బంతిని వేయగా.. సిల్వా డే డిఫెన్స్ ఆడాడు. ఆ బంతి ఇన్‌ సైడ్‌ ఎడ్జ్‌ తీసుకుని స్టంప్స్‌ మీదకు వెళ్లబోయింది. దానిని తప్పించేందుకు ప్రయత్నించాడు. బంతిని పక్కకు నెట్టేందుకు ప్రయత్నించగా అది ఎడ్జ్‌ తీసుకుని మళ్లీ స్టంప్స్‌ మీదకు వెళ్లింది. రెండోసారి తప్పించే క్రమంలో ఈసారి ధనంజయ డి సిల్వా బేల్స్‌ ను గిరాటేశాడు. అంతే హిట్‌ వికెట్‌ గా వెనుదిరిగాడు. టెస్టుల్లో రెండుసార్లు ధనంజయ డి సిల్వా హిట్‌ వికెట్‌ అయ్యాడు. శ్రీలంక నుంచి రెండుసార్లు హిట్‌ వికెట్ అయిన రెండో ప్లేయర్‌ గా నిలిచాడు.