దీపక్ చాహర్ లవ్ సక్సెస్ కావడానికి ధోని కారణమా?

deepak

‘ఐపీఎల్‌ 2021’ సీజన్‌లో చైన్నై సూపర్‌ కింగ్స్‌ జోరుగా ఆడుతోంది. 14 మ్యాచుల్లో 9 విజయాలతో టేబుల్‌ సెకెండ్‌ ప్లేస్‌లో కొనసాగుతోంది. పంజాబ్‌ చేతిలో పరాజయంతో అభిమానులు ఒకింత నిరాశ చెందారు. కానీ, మ్యాచ్‌ అనంతరం సీఎస్కే ప్లేయర్‌ దీపక్‌ చాహర్‌ చేసిన ప్రపోజల్‌ చూసి అందరూ మ్యాచ్‌ ఫలితాన్ని మర్చిపోయి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బై పోయారు. ఇప్పుడు క్రికెట్‌ ప్రపంచంలో దీపక్‌ చాహర్‌ ప్రపోజల్‌ తెగ వైరల్‌ అవుతోంది. ఎవరు ఆ అమ్మాయి? ఎలా పరిచయం? ఎప్పటి నుంచి సాగుతోంది ఈ ప్రేమాయణం? అందరూ అడుగుతున్న ప్రశ్నలు ఇవే.

వీరి ప్రేమ ఎప్పుడు పుట్టింది?

దీపక్‌ చాహర్‌ ప్రపోజ్‌ చేసిన అతని ప్రేయసి పేరు జయ భరద్వాజ్‌. ఆమె సినీ నటుడు సిద్ధార్థ్‌ భరద్వాజ్‌ చెల్లెలు. వీరి స్వస్థలం ఢిల్లీ. ఆమె హిందీ బిబ్‌ బాస్‌, స్ప్లిట్స్‌ విల్లా రియాలిటీ షోలోనూ పాల్గొంది. ప్రస్తుతం ఒక కార్పొరేట్‌ కంపెనీ నడిపిస్తున్నట్లు సమాచారం. దీపక్‌ చాహర్‌- జయ భరద్వాజ్‌ చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. దాదాపు 2 నెలలుగా డేటింగ్‌ చేస్తున్నారు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ బయోబబుల్‌ ఉంటోంది. చెన్నై టీమ్‌ కుటుంబ సభ్యులతో కలిసి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్సుకు వెళ్లింది.

deepak dhoniప్రపోజల్‌ వెనుక ధోనీ పాత్ర

దీపక్‌ చాహర్‌ లైవ్‌ ప్రపోజల్‌ వెనుక ధోనీ పెద్దన్న పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. దీపక్‌ చాహర్‌ ఐపీఎల్‌ లీగ్‌లో చైన్నై ఆఖరి మ్యాచ్‌ రోజు ప్రపోజ్‌ చేయాలని అనుకున్నాడంట. ఆ విషయాన్నే ధోనీకి చెప్పాడు దీపక్‌. ఆ విషయం విన్నాక.. అప్పటి వరకు ఎందుకు నానుస్తావు? అదేదో వెంటనే చెప్పెయ్‌ అని సలహా ఇచ్చాడం కెప్టెన్‌ కూల్‌. ధోనీ చెప్పిందే తడవుగా దీపక్‌ చాహర్‌ తన ప్రపోజల్‌కు ప్లాన్‌ చేశాడు. పంజాబ్‌తో మ్యాచ్‌ అయిపోగానే ఫ్యామిలీ స్టాండ్స్‌లో ఉన్న తన ప్రేయసి వద్దుకు వెళ్లి ఒక్కసారిగా మోకాళ్లపై కూర్చొని రింగ్‌ చూపించాడు. ఆమె ఆనందంతో ఎగిరి గంతులేసింది. గట్టిగా ఎస్‌ ఎస్‌ అంటూ తన ప్రపోజల్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసింది. వెంటనే వారు ఉంగరాలు మార్చుకున్నారు. దీపక్‌ చాహర్‌కు ఉంగరం తొడుగుతూ చేతులు వణకడం చూసి అందరూ ఆటపట్టించారు.

 

View this post on Instagram

 

A post shared by Deepak Chahar (@deepak_chahar9)