పనికిరాడని తనని పక్కన పెట్టిన SRHకి దిమ్మతిరిగిపోయే సమాధానం ఇచ్చిన డేవిడ్ వార్నర్

టీ 20 వరల్డ్ కప్ ముగిసింది. ఆస్ట్రేలియా టీమ్ పొట్టి ఫార్మేట్ లో విజేతగా నిలిచింది. కానీ.., ఆసీస్ ని విశ్వ విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించింది మాత్రం డేవిడ్ వార్నర్. నిజానికి ఈ వరల్డ్ కప్ మొదలయ్యే ముందు ఆస్ట్రేలియా విజేతగా నిలుస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. ఆ టీమ్ ఆటగాళ్లు అంతా ఫామ్ కోల్పోయి సతమతం అవుతూ వచ్చారు. బాంగ్లాదేశ్ పై కూడా టీ 20 సీరీస్ జారవిరుచుకున్నారు. ఇక డేవిడ్ వార్నర్ పరిస్థితి గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వరల్డ్ కప్ కి ముందు జరిగిన ఐపీఎల్ లో వార్నర్ ఎదుర్కొన్న అవమానాలు అన్నీ ఇన్నీ కాదు.

సన్ రైజర్స్ యాజమాన్యం వార్నర్ ని టీమ్ నుండి తప్పించింది. అతనికి కనీసం డగౌట్ లో కూడా స్థానం ఇవ్వకుండా అవమానించింది. ఒకప్పుడు సన్ రైజర్స్ జట్టుని విజేతగా నిలిపిన వార్నర్ ని అలా చూడాల్సి రావడం ఫ్యాన్స్ కి సైతం ఇబ్బందిగా మారింది. అలాంటి అవమానకర స్థితిలో వార్నర్ సన్ రైజర్స్ కి దూరమయ్యాడు. కానీ.. ఇంత క్లిష్ట స్థితి నుండి వార్నర్ దెబ్బ తిన్న పులిలా గర్జించాడు. వరల్డ్ కప్ లో మెరుపులు మెరిపించాడు. మొత్తం టోర్నమెంట్ లో 289 పరుగులు చేసి.. ఆస్ట్రేలియా విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు ఇంతేకాదు.. కీలకమైన సెమీస్, ఫైనల్ మ్యాచ్ లలో అర్ధ సెంచరీలు సాధించి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డుని సైతం దక్కించుకున్నాడు.

David Warner Man of The Match - Suman TVటీ 20 వరల్డ్ కప్ లో వార్నర్ మెరుగైన ప్రదర్శన చూసిన సన్ రైజర్స్ ఫ్యాన్స్.. ఎస్.ఆర్.హెచ్ మేనేజ్మెంట్ పై ఫైర్ అవుతున్నారు. ఒక గొప్ప ఆటగాడిని మీరు కోల్పోయారు. ఫామ్ కోల్పోయిన ఆటగాడిలో ధైర్యాన్ని నింపాల్సిన సపోర్టింగ్ స్టాఫ్.. వార్నర్ భాయ్ ని కించపరిచారు. కానీ.., ఇప్పుడు వార్నర్ టీ 20లలో తాను ఎంతటి విలువైన ఆటగాడో చాటుకున్నాడు. ఇప్పుడు మీరు వార్నర్ భాయ్ ని రిటైన్ చేసుకుంటామని మీరు ముందుకి వచ్చినా.. అతను ఒప్పుకోడు. ఇంత గొప్ప ఆటగాడినా మీరు అవమానించింది. అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మరి.. ఎస్.ఆర్.హెచ్ డేవిడ్ వార్నర్ ని వదులుకుని తప్పు చేసిందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.