‘క్యాండిస్‌’కు ‘తెలుగు’లో ప్రపోజ్ చేసిన డేవిడ్ వార్నర్!..

కరోనా విజృంభణతో ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని క్రీడా కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఆటగాళ్లలందరూ ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చి ఈ లాక్‌డౌన్‌ సమయాన్ని చాలా బాగా ఎంజాయ్‌ చేశారు. అందులో ముఖ్యంగా చెప్పుకొవాల్సింది ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌ గురించి. తన పిల్లలు, సతీమణి కాండీస్‌తో కలిసి టిక్‌టాక్‌ వీడియోలు చేస్తూ వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తూ వార్నర్‌ హల్‌చల్‌ చేశాడు. ముఖ్యంగా తెలుగు, తమిళం, హిందీ భాషల్లోని పాటలకు స్టెప్పులేసి, తన నోటి వెంట డైలాగ్‌లు చెప్పి అభిమానులను ఎంటర్‌టైన్‌ చేశాడు. ఇదిలా ఉండగా, వార్నర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో మరో ఆసక్తికరమైన ఫొటోను పోస్టు చేశాడు. ఈ ఫొటోకు వార్నర్‌ జతచేసిన వ్యాఖ్యను చదివిన తెలుగు అభిమానుల ఫిదా అవుతున్నారు.

ఈసారి ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ మరోసారి తెలుగుపై అభిమానాన్ని చాటుకున్నాడు. తన భార్య కాండీస్‌ను ఎత్తుకున్నట్లు ఉన్న ఫొటోనూ, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. అంతేకాదు ఆ ఫోటోకు క్యాప్షన్‌గా ”నేను నిన్ను ప్రేమిస్తున్నాను” అంటూ తెలుగు వ్యాక్యాన్ని ఇంగ్లీష్‌లో రాశాడు. దీనికి 7.80లక్షల లైక్స్‌ వచ్చాయి. ఇక ఈ పోస్ట్‌ను చూసిన నెటిజన్స్‌ ”నువ్వు కేక డేవిడ్‌ మామ” అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ‘అల వైకుంఠపురంలో’ చిత్రంలోని ‘బుట్ట బొమ్మా’, ‘రాములో రాములా, ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలోని ‘మైండ్‌ బ్లాక్‌’ అనే పాటలకు చిందులేసి తెలుగు వారి మనసులను దోచుకున్నాడు వార్నర్‌. అలాగే మహేష్ బాబు నటించిన ‘పోకిరి, ప్రభాస్‌ నటించిన ‘బహుబలి’ చిత్రాలకు సంబంధించిన డైలాగ్‌లకు టిక్‌టాక్‌లు చేశాడు. ఇలా క్రీడాభిమానులే కాదు సాధారణ ప్రేక్షకులు కూడా డేవిడ్‌ ఫ్యాన్స్‌గా మారిపోయారు. చేతిలో గులాబీ పువ్వులను పట్టుకుని తన భార్య కాండీస్‌ను ఎత్తుకున్నట్టు ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ.. ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను’ అనే తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్‌లో రాశాడు. దీనికి వార్నర్‌ భార్య కాండీస్‌ వెంటనే ప్రేమకు చిహ్నామైన లవ్‌ ఎమోజీలను రిప్లేగా ఇచ్చింది. ప్రస్తుతం ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.