షర్ట్‌ విప్పి రచ్చరచ్చ చేసిన క్రిస్టియానో రొనాల్డో.. వీడియో వైరల్‌

ronaldo

క్రిస్టియానో రొనాల్డో.. ఈ పేరుకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉంది. గోల్‌ చేసిన తర్వాత రొనాల్డో సెలబ్రేషన్స్‌ అంటే అభిమానులకు ఎంతో ఇష్టం. అలాంటిది డ్రా కాబోయే మ్యాచ్‌ను విజయంగా మార్చితే ఎలావుంటుంది. ఆ గోల్‌ చేసినప్పుడు రొనాల్డో ఎంత సంబరాలు చేసుకుని ఉంటాడు. అవును మరి అంతా ఇంతా కాదు షర్ట్‌ తీసి రచ్చరచ్చ చేశాడు. విల్లార్‌ రియల్‌తో ఓల్డ్‌ ట్రాఫ్రడ్‌ వేదికగా మ్యాచ్‌ జరిగింది. అందరూ ఈ మ్యాచ్‌ కచ్చితంగా డ్రాగా ముగుస్తుందని భావించారు. కానీ, ఆఖరి ఐదు నిమిషాల్లో రొనాల్డో గోల్‌ చేసి మాంచెస్టర్‌ యునైటెడ్‌కు అద్భుత విజయాన్ని అందించాడు.

పుష్కరం దాటినా.. అదే జోరు

విల్లార్‌ రియల్‌పై రెండో గోల్‌ చేయగానే క్రిస్టియానో రొనాల్డో షర్ట్‌ తీసి మైదానంలో పరుగులు తీశాడు. అభిమానులను చూస్తూ గర్వంగా గర్జించాడు. అతడిని చూసి అభిమానులు మరింత ఉత్సాహంతో సందడి చేశారు. ఇప్పుడు సోషల్‌ మీడియా వేదికగా రొనాల్డో ఫొటోలు, వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. అభిమానులు కండలు తిరిగిన రొనాల్డో బాడీ చూసి ఆశ్చర్యపోతున్నారు. సరిగ్గా 12 సంవత్సరాల క్రితం మైదానంలో రొనాల్డో ఇదే తరహా సంబరాలు చేసుకున్నాడు. ఇప్పుడు ఆ వీడియో తాజా వీడియోని చూపిస్తూ అప్పటికీ ఇప్పటికీ ఏమాత్రం మారలేదంటూ కామెంట్‌ చేస్తున్నారు. మరి ఆ దృశ్యాలను మీరూ చూసేయండి.