మాంచెస్టర్‌కి చెందిన ఫుట్‌బాల్ ప్లేయర్ బెంజమిన్ మెండీ అత్యాచారం కేసులో విచారణ ఎదుర్కుంటున్నాడు. తనపై మెండీ అత్యాచారం చేశాడని ఓ మహిళ ఆరోపించిన నేపథ్యంలో విచారణ ఎదుర్కుంటున్నాడు. 2018లో ఫుట్‌బాల్ ప్రపంచకప్‌ను గెలుచుకున్న ఫ్రెంచ్ జట్టులో మెండీ ఉన్న సంగతి తెలిసిందే. 28 ఏళ్ళ మెండీ ఒక మహిళ ఫోన్ తీసుకుని, ఆమెను ట్రాప్ చేసి తన బెడ్‌రూమ్‌కి తీసుకెళ్ళాడని సదరు మహిళ ఆరోపించింది. మెండీని అక్టోబర్ 2020లో ఒక బార్‌లో కలుసుకున్నానని, ఆ సమయంలో అతనితో పాటు మాంచెస్టర్ ఫుట్‌బాల్ క్లబ్ సహచరుడు జెస్సీ లింగార్డ్ కూడా ఉన్నాడని సదరు మహిళ పేర్కొంది. ఆ మహిళను మెండీ రూరల్ చెషైర్‌లోని తన ఇంటికి తీసుకెళ్ళాడని, మెండీ తన వేలిముద్రతో బెడ్ రూమ్ తలుపు తెరిచాడని, అప్పుడు తన ఫోన్ మెండీ చేతిలో ఉందని, తన ఫోన్‌ను ఇవ్వాల్సిందిగా కోరుతూ మెండీ బెడ్‌రూమ్‌లోకి వెళ్ళానని పోలీసులకు తెలిపింది.
బెడ్‌రూమ్‌లోకి వచ్చిన తర్వాత డోర్ లాక్ చేశాడని, ఇప్పుడు ఎక్కడికీ వెళ్ళలేవంటూ మెండీ తనను అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడని ఆమె వెల్లడించింది. తనను ఏమీ చేయద్దని వేడుకుంటున్నా మెండీ వినలేదని ఆమె తెలిపింది. అంతేకాదు ఇప్పటి వరకూ 10 వేల మంది మహిళలతో శృంగారం చేసినట్టు మెండీ తనకు చెప్పాడని ఆమె పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. ఇదే వాంగ్మూలాన్ని ఆమె కోర్టులో వెల్లడించింది. అయితే మెండీ ఎలా తెలుసని పోలీసులు ప్రశ్నించగా.. బార్‌లో కలిసినట్లు ఆమె వెల్లడించింది. తమపై అత్యాచారం చేశాడని మరో 4 గురు మహిళలు కూడా మెండీపై ఆరోపణలు చేశారు. ఈ అత్యాచార ఘటనలన్నీ మెండీ విలాసవంతమైన ఇంట్లోనే జరిగాయని సదరు మహిళలు కోర్టులో పేర్కొన్నారు. అంతేకాదు మెండీ ఇద్దరు టీనేజ్ బాలికలపై కూడా అత్యాచారం చేసినట్లు మహిళలు ఆరోపించారు. దీనిపై కోర్టులో ఇంకా విచారణ కొనసాగుతోంది. అయితే మెండీ మాత్రం ఈ విషయాలను కొట్టి పారేస్తున్నాడు. మరి మహిళలపై అత్యాచార ఆరోపణలు ఎదుర్కుంటున్న బెంజమిన్ మెండీపై మీ అభిప్రాయమేంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.