టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్.. తప్పుగా ట్వీట్ చేసి నెటిజెన్ల వలలో చిక్కుకుపోయాడు. పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోను అభినందిస్తూ.. యువీ చేసిన ట్వీటే అందుకు కారణం. యువీకి క్రికెట్ తో పాటు ఫుట్‌బాల్ అంటే కూడా ఎక్కువ ఇష్టం. ఈ ఇష్టమే తనను అనుకోని కష్టాల్లోకి నెట్టింది. తాజాగా, ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో చేసిన 700వ గోల్ పై స్పందిస్తూ ట్విట్టర్ లో యువీ చేసిన ఓ ట్వీట్ మిస్ ఫైర్ అయింది. అలవాటులో పొరపాటుగా క్రికెట్ పరిభాషనే వాడిన యువీ అడ్డంగా బుక్కయ్యాడు.దీంతో నెటిజన్లు యువీని ఓ ఆడుకుంటున్నారు.
అసలు విషయానికొస్తే.. ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్)లో భాగంగా మాంచెస్టర్ యూనైటైడ్ తరఫున ఆడుతున్న రొనాల్డో.. నిన్న ఎవర్టన్ తో జరిగిన మ్యాచ్ లో గోల్ కొట్టడం ద్వారా “లీగ్ ఫుట్‌బాల్ కెరీర్ లో 700 గోల్స్ కొట్టిన తొలి ఆటగాడిగా..” అరుదైన ఘనత సాధించాడు. దీంతో ప్రపంచవ్యాప్తంగా రొనాల్డోకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో యువీ కూడా ఓ ట్వీట్ చేద్దామనుకున్నాడు. అనుకుందే తడవుగా.. “కింగ్ ఈజ్ బ్యాక్. ఫామ్ తాత్కాలికం. క్లాస్ శాశ్వతం.. 700 క్లబ్ కు రొనాల్డోకు స్వాగతం. నెంబర్ 7 GOAT..” అని ట్వీట్ చేశాడు. ఇదే యువీ కొంపముంచింది.
King 👑 is back ! Form is temporary class is forever !!! @Cristiano welcome to 700 club ! No7 #GOAT𓃵 #legend siiiiiiiiiiii !!!!! @ManUtd
— Yuvraj Singh (@YUVSTRONG12) October 9, 2022
క్లబ్ ఫుట్‌బాల్ చరిత్రలో 700 గోల్స్ కొట్టిన తొలి ఫుట్‌బాలర్ రొనాల్డో మాత్రమే. అదే అంశాన్ని ప్రస్తావిస్తూ నెటిజన్లు యువీని ఓ ఆడుకుంటున్నారు. “క్లబ్ ఫుట్‌బాల్ మ్యాచుల్లో 700 గోల్స్ కొట్టిన తొలి ఫుట్‌బాలర్ రొనాల్డోనే. మళ్లీ క్లబ్ కు స్వాగతమేంటి..? ఇంతకుముందు నువ్వేదో అందులో ఉన్నట్టు..” అంటూ భిన్న రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయంపై.. యువీ మరోసారి స్పందిస్తాడేమో చూడాలి.
𝟕𝟎𝟎 𝐜𝐥𝐮𝐛 𝐠𝐨𝐚𝐥𝐬.
What a beautiful number we’ve achieved together!
Thank you to all my teammates, coaches, clubs, family & friends and of course my fans.
United we continue! 🙏🏽 pic.twitter.com/oYWo766Xcl— Cristiano Ronaldo (@Cristiano) October 10, 2022