క్రికెట్ ప్రపంచమే ఒక దేవుడిగా కొలిచే సచిన్ టెండూల్కర్ గురుంచి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. స్ట్రైట్ డ్రైవ్, అప్పర్ కట్ లాంటి మరుపురాని జ్ఞాపకాలతో పాటు.. అత్యధిక(100) సెంచరీలు, అత్యధిక (200టెస్టులు) మ్యాచులు ఆడిన ఆటగాడిగా పలు రికార్డులు నెలకొల్పాడు. అయితే ప్రస్తుతానికి సచిన్ ఇన్ని కీర్తిప్రతిష్టలు సంపాదించినా.. కెరీర్ ఆరంభంలో మాత్రం ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడు. అందులో మరుపురాని సంఘటన అంటే.. పాక్ క్రికెటర్లు హేళన చేసిందే. మ్యాచులో సచిన్ ను గాయపర్చడమే కాకుండా.. ‘ఇంటికెళ్లి పాలు తాగి రాపో..’ అంటూ ఎక్కిరించారు కూడా. ఈ సంఘటన 1989లో జరిగింది.
1989లో భారత జట్టు 4 మ్యాచుల టెస్ట్ సిరీస్, 4 మ్యాచుల వన్డే సిరీస్ కోసం పాకిస్తాన్ లో పర్యటించింది. ఆనాటికి సచిన్ వయసు 16 ఏళ్ళు. అప్పటికే జట్టులో కపిల్ దేవ్, సంజయ్ మంజ్రేకర్, అజారుద్దీన్, రవి శాస్త్రి వంటి దిగ్గజాలు ఉండడంతో.. అందరి కళ్లు వారిపైనే ఉండేవి. టెస్ట్ సిరీస్ డ్రాగా ముగియడంతో.. ఇరు జట్లు వన్డే సిరీస్ గెలవడంపై దృష్టిపెట్టాయి. ఆ సమయం రానే వచ్చింది. అయితే.. బ్యాడ్ లైట్ కారణంగా పెషావర్ వేదికగా జరగాల్సిన తొలి వన్డే రద్దు చేస్తున్నట్లుగా అంపైర్లు ప్రకటించారు. అయితే.. ప్రేక్షకులు నిరాశతో వెనుతిరగకూడదని 20 ఓవర్ల ఎక్సిబిషన్ మ్యాచ్ నిర్వహిస్తారు. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 157 పరుగులు చేసింది.
1989,INDIA VS PAK exhibition match.. pic.twitter.com/OECr5f6Fo8
— Govardhan Reddy (@gova3555) October 10, 2022
అనంతరం 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 3 వికెట్ల నష్టానికి 153 పరుగులకే పరిమితమై 4 పరుగుల తేడాతో ఓటమి పాలవుతుంది. అయితే.. ఈ మ్యాచులో సచిన్ ఆడిన ఇన్నింగ్స్, జరిగిన సంఘటనలు మ్యాచుకే హైలైట్. 3 వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన సచిన్.. 53(18 బంతుల్లో 1 ఫోర్, 6 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడతాడు. అయితే.. ఈ ఇన్నింగ్స్ పాకిస్తాన్ ఆటగాళ్లపై కసితో ఆడతాడు. అందుకు కారణం.. సచిన్ క్రీజులోకి వచ్చేటపుడు మైధానంలో ఒకటే అరుపులు..పిల్లోడా ఇంటికెళ్లి పాలు తాగి రాపో..!” ఇవే మాటలు. పాక్ ఆటగాళ్లు కూడా తందానా అంటూ.. ప్రేక్షకులకు వత్తాసు పలికారు. క్రీజులోకి అడుగుపెట్టిన సచిన్.. వెంటనే ముస్తాక్ అహ్మద్ బౌలింగ్ లో వెంటవెంటనే రెండు సిక్సర్లు బాధతాడు. వెంటనే సచిన్ దగ్గరకొచ్చిన అబ్దుల్ ఖాదిర్(పాక్ స్పిన్ బౌలర్)..”హే బచ్చా వాళ్ళ బౌలింగ్ లో కాదు.. నా బౌలింగ్ లో కొట్టు అంటూ..” స్లెడ్జింగ్ కు దిగుతాడు.
ఆపై బౌలింగ్ కొచ్చిన ఖాదిర్ కు సచిన్ మరిచిపోని గిఫ్ట్ ఇస్తాడు. 6, 0, 4, 6, 6, 6.. ఇలా ఒకే ఓవర్ లో 28 పరుగులు పిండుతాడు. అంతే.. స్టేడియం ఒక్కసారిగా సైలెంట్. ఆనాడే సచిన్ ఏంటి అన్నది.. పాక్ క్రికెటర్లకు తెలిసొచ్చింది. ఈ విషయాన్ని వసీం అక్రమ్ సచిన్ ను మొదటిసారి చూసినప్పుడు జరిగిన సంఘటనగా చెప్పుకొచ్చాడు. “ఈ మ్యాచుకు ముందే.. మేం సచిన్ ను మొదటిసారి కరాచీ గ్రౌండ్‌లో ప్రాక్టీస్ చేస్తుంటే చూశాం. 16 ఏళ్ల కుర్రాడిలా కనిపించాడు. వకార్ యూనిస్, నేను ఒకరి మొఖాలు ఒకరం చూసుకున్నాం. ఈ పిల్లాడు ఏం చేయగలడు అని నవ్వుకున్నాం. ఇప్పుడు చూస్తే 2 దశాబ్దాలుగా క్రికెట్ ప్రపంచాన్ని ఏలాడు ఆ కుర్రాడు..” అంటూ సచిన్ గురించి చెప్పుకొచ్చాడు పాక్ మాజీ సారధి వసీం అక్రమ్.
when @sachin_rt came to bat crowd made a fun Says (hey kid, go home & drink milk). Sachin hit 2 sixes to Mustaq.
Abdul Qadir- ‘Bachchon ko kyon mar rahe ho? Hamein maar dikhao. (Why are you hitting kids? Try and hit me)
RESULT- Sachin hit 4 sixes in his over (6,0,4,6,6,6)#Legends pic.twitter.com/XlqYX3NbkP— Sachin Tendulkar🇮🇳FC (@CrickeTendulkar) December 16, 2017