అక్టోబర్ 16 నుంచి ఆస్ట్రేలియా వేదికగా పొట్టి ప్రపంచకప్ పోరు జరగనున్న సంగతి తెలిసిందే. అర్హత సాధించిన అన్ని జట్లు ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకొని వార్మప్ మ్యాచులు కూడా మొదలుపెట్టేశాయి. ఈ టోర్నీలో అతిథ్య జట్టు ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతుండగా, ఇండియా, ఇంగ్లాండ్ జట్లు టైటిల్ ఫేవరెట్ గా అడుగుపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో విండీస్ మాజీ క్రికెటర్ క్రిస్ గేల్ ఆసక్తికర వ్యా ఖ్యలు చేశాడు. ప్రపంచ కప్ ఫైనల్ పోరులో ఏయే జట్లు తలపడనున్నాయన్నది ప్రెడిక్ట్స్ చేశాడు. గేల్ అంచనా ప్రకారం భారత జట్టు సెమీస్ లోనే ఇంటిదదారి పడుతుందట.
వారం రోజుల్లో మొదలుకానున్న పొట్టి ప్రపంచ కప్ పోరు కోసం అగ్రశ్రేణి జట్లైన భారత్, ఇంగ్లాండ్ జట్లు పదిరోజుల ముందుగానే ఆస్ట్రేలియా చేరుకొని ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. ఇక ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్, శ్రీలంక జట్లు అయితే ఈనెల ప్రారంభంలోనే అక్కడకు చేరుకున్నాయి. మిగిలిన అన్ని జట్లు కూడా అక్టోబర్ 15 నాటికి ఆస్ట్రేలియాకు రానున్నాయి. అన్ని జట్లు కూడా ఛాంపియన్ గా నిలవడానికి ఆఖరిదాకా పోరాడతాయనడంలో సందేహం లేదు. ఈ తరుణంలో విండీస్ మాజీ క్రికెటర్ క్రిస్ గేల్ ప్రపంచ కప్ ఫైనల్ పోరులో ఏయే జట్లు తలపడనున్నాయన్నది ప్రెడిక్ట్స్ చేశాడు. గేల్ అంచనా ప్రకారం.. ‘ఆస్ట్రేలియా-వెస్టిండీస్’ జట్లు ఫైనల్ లో తలపడనున్నాయట. ఈ రెండు జట్ల మధ్య ఉత్కంఠభరితంగా ఫైనల్ పోరు జరగనుందని గేల్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
The Boss Chris Gayle thinks Australia and West Indies will end up playing at T20 World Cup 2022’s final. Would you bat on it? 🤔#CG #chrisgayle #universeboss #westindies #australiacricket #cwc22 #cwc pic.twitter.com/C1CRCKQPLm
— 10CRIC (@10cric_official) October 10, 2022
“ఈ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఆస్ట్రేలియా-వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతుందని నేను భావిస్తున్నా. అయితే కరేబియన్ జట్టుకు ఫైనల్ చేరడం అంత ఈజీ కాదు. కీరన్ పొలార్డ్, ఆండ్రూ రసెల్, డ్వేన్ బ్రావో వంటి ఆటగాళ్లు లేకుండా ఈసారి బరిలోకి దిగుతోంది. అయినప్పటికీ.. ప్రస్తుత విండీస్ జట్టులో చాలా మంది ప్రతిభావంతమైన ఆటగాళ్లు ఉన్నారు. వారు తప్పక జట్టును ఫైనల్ కు చేరుస్తారు..” అంటూ గేల్ తన ప్రెడిక్షన్ ను చెప్పుకొచ్చాడు.
టీ20లలో ఏ జట్టు విజయం సాధిస్తుంది అన్నది ఆఖరి క్షణం వరకు తెలియదు. క్షణాల్లో మ్యాచ్ గమనం మారిపోతుంది. ఓడిపోతుందనుకున్న జట్టు గెలుస్తుంది. గెలుస్తుందనుకున్న జట్టు దారుణంగా ఓడుతుంది. కాకుంటే.. ప్రపంచకప్ పోరు కనుక ఎవరికి తోచిన విధంగా వారు తమ అభిప్రాయాలు వెల్లడిస్తుండడం కామన్. గేల్ ప్రెడిక్షన్ ను పక్కనపెడితే.. ఒక్కసారి కూడా ప్రపంచకప్ గెలవని దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు ఈసారి టైటిల్ పై కన్నేశాయి. అలాగే.. 2007 తరువాత నుంచి అందని ద్రాక్షగా మిగిలుతోన్న పొట్టి ప్రపంచకప్ ను ఈసారి ఎలాగైనా సొంతం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది.
7️⃣ Days To Go For #T20WorldCup2022 🏏✨
2007 – India won the inaugural T20I World Cup under the captaincy of #MS Dhoni 🔥
Catch The #T20WORLDCUP2022 Live On #Uwin
☑️ https://t.co/dLapj4OohN
#T20WorldCup2022 #TeamIndia #BCCI #uwin #uwingames #uwinapp #uwinsports #msdhoni pic.twitter.com/cdriqMfeor— Uwin Games (@uwinsportsgames) October 9, 2022