క్రికెటర్లు, అథ్లెట్స్ అన్నాక అమ్మాయిల ఫాలోయింగ్ చాలా నేచురల్. అందులో కుర్రాళ్లకు అయితే తగ్గేదే లే అన్నట్లు సోషల్ మీడియాలో ఏదో ఓ న్యూస్ వినిపిస్తూనే ఉంటుంది. ఇక టీమిండియా విషయానికొస్తే.. స్టార్ క్రికెటర్లు కోహ్లీ, రోహిత్ లాంటి వాళ్లకు పెళ్లి అయిపోయింది. సో వాళ్ల గురించి పెద్దగా న్యూస్ ఏముండదు. ఇక పంత్.. ట్రయాంగిల్ లవ్ స్టోరీ గురించి చాలావరకు క్రికెట్ అభిమానులకు తెలుసు. మరో కుర్రాడు ఇషాన్ కిషన్ కి గ్లామరస్ గర్ల్ ఫ్రెండ్ ఉండనే ఉంది. దక్షిణాఫ్రికాతో మ్యాచులో మనోడు బాదుడిగా ఫ్లాట్ అయిపోయింది. ఇంకెందుకు లేటు అన్నట్లు ఇన్ స్టాలో స్టోరీ పెట్టి మరీ తెగ ఎగ్జైట్ అయిపోయింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. టీమిండియా-దక్షిణాఫ్రికా మధ్య ఆదివారం రెండో వన్డే జరిగింది. ఈ మ్యాచులో మన జట్టు గెలవడంలో శ్రేయస్ అయ్యర్ తోపాటు ఇషాన్ కిషన్ కూడా కీలక పాత్రపోషించారు. జస్ట్ 7 పరుగుల తేడాతో అద్భుతమైన సెంచరీ మిస్ చేసుకున్నాడు. శతకం మిస్ అయిన సంగతి పక్కనబెడితే.. ఇషాన్ సిక్సులు, ఫోర్లు కొడుతుంటే స్టేడియంలో వీక్షకులు అరిచి గోల గోల చేశారు. ఇక ఇషాన్ గర్ల్ ఫ్రెండ్ అదితి హుండియా!?.. దగ్గర లేకపోయినప్పటికీ సోషల్ మీడియాలో ఇషాన్ ని పొగుడుతూ పోస్ట్ పెట్టింది. ‘వెల్ డన్ ఐకే’ అని క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ఈ పోస్టు కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది.
ఇదిలా ఉండగా వీరి మధ్య గత కొన్నాళ్లుగా రిలేషన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరు ప్రేమగా హగ్ చేసుకున్న ఫొటోలు గతంలో వైరల్ కావడంతో ఈ జోడీ మధ్య ఉన్నది ప్రేమ అనే రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇకపోతే అండర్-19 ప్రపంచకప్ తో వెలుగులోకి వచ్చిన ఇషాన్ కిషాన్.. ఐపీఎల్ లోనూ ముంబయి ఇండియన్స్ తరఫున గత కొన్నేళ్ల నుంచి ఆడుతున్నాడు. టీమిండియాలోనూ కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. మరోవైపు రాజస్థాన్ కి చెందిన అదితి.. 2017 మిస్ ఇండియా పోటీల్లో పాల్గొంది. ఫైనల్ వరకు వెళ్లి.. ఎఫ్బీబీ కలర్స్ ఫెమినా మిస్ ఇండియా రాజస్థాన్ గా కిరీటం గెలుచుకుంది. అంతకు ముందు ఏడాది.. 2016లో మిస్ బాడీ బ్యూటీఫుల్, 2016లో మిస్ రాజస్థాన్ గా నిలిచింది. చెప్పాలంటే అదితి ఫేవరెట్ క్రికెటర్లు ధోనీ, కోహ్లీ.. కానీ ఫీల్డ్ లో ఇషాన్ ఉంటే మాత్రం తన చూపు అతడిపై నుంచి పక్కకు వెళ్లదని ఈమె చెప్పింది. మరి ఇషాన్-అదితి రిలేషన్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.