తెలుగు సినీ పరిశ్రమపై వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

mla gadikota srikanth reddy

వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తెలుగు సినీ పరిశ్రమపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమంపై జరిగిన స్వల్పకాలిక చ‌ర్చపై మాట్లాడిన ఆయన తెలుగు చిత్ర దర్శకులకు, నిర్మాతలకు కొన్ని సూచనలు చేశారు. ఇదిలా ఉండగా ఇటీవల విడుదలైన జైభీమ్ సినిమాపై కూడా ప్రశంసలు కురిపించారు. తమిళ స్టార్ సూర్య నటించిన ఈ సినిమా ఇటీవల ఓటీటీలో విడుదలైన సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే.

ఇక ఈ సినిమా గురుంచి కూడా మాట్లాడుతూ.. మా కుటుంబంతో ఈ సినిమాను చూశానని.. గ్రామాల్లో ఇంకా అక్కడక్కడ అంటరానితనం, దళితుల బహిష్కరణ వంటివి జరుగుతూనే ఉన్నాయని తెలిపారు. ఇలాంటి వాటిపై రాజకీయ నేతలు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఇక దీంతో పాటు కొందరు కమర్షియల్ ఎలిమింట్స్ పై దృష్టి పెడుతూ కోట్లు సంపాదిస్తున్నారని, ఇలా కాకుండా జైభీమ్ లాంటి సినిమాలను చూసి ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అలా అని నేను తెలుగు దర్శకులను తప్పుపట్టడంలేదని జైభీమ్ లాంటి మెసేజ్ ఓరియేంటెడ్ సినిమాలు రావాలని అందరూ కోరుకుంటున్నారని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సూచించారు. ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.