జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పార్టీకి అవసరం.. బుచ్చయ్య చౌదరి సంచలన కామెంట్స్

Junior NTR TDP party needs Butchayya Chaudhary sensational comments - Suman TV

గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. టీడీపీ సీనియర్ నేత. 40 ఏళ్లుగా పసుపు జెండా తప్ప, మరో అజెండా లేకుండా ఆయన రాజకీయాల్లో కొనసాగితున్నారు. అప్పట్లో సీనియర్ యన్టీఆర్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన బుచ్చయ్య చౌదరి.. ఈ నాటికీ టీడీపీకి విధేయుడిగా ఉంటూనే వస్తున్నారు. 2019 ఎన్నికల్లో జగన్ ప్రభంజనాన్ని తట్టుకుని కూడా ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. పార్టీపై ఇంతటి ప్రేమ, ప్రజల్లో ఇంతటి ఆదరణ ఉన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి మొన్నటి మొన్న టీడీపీ పార్టీకి రాజీనామా చేయడానికి సిద్దపడటం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది.

తరువాత కాలంలో టీడీపీ అధినేత బుచ్చయ్య చౌదరితో వ్యక్తిగతంగా సమావేశం అయ్యి.., 40 నిమిషాల పాటు చర్చలు జరిపారు. ఈ పరిణామం తరువాత బుచ్చయ్య పార్టీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నా.., అధినేత వద్ద తన అభిప్రాయాలను కుండ బద్దలు కొట్టినట్టు చెప్పడం విశేషం. ఈ నేపథ్యంలోనే తాజాగా బుచ్చయ్య చౌదరిని సీనియర్ జర్నలిస్ట్ జాఫర్ ఇంటర్వ్యూ చేశారు. సుమన్ టీవీ ఎక్స్ క్లూజివ్ అయిన ఈ “బ్లాక్ అండ్ వైట్ విత్ జాఫర్” ఇంటర్వ్యూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి జూనియర్ యన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై సంచలన కామెంట్స్ చేయడం విశేషం.

Junior NTR TDP party needs Butchayya Chaudhary sensational comments - Suman TV“జూనియర్ యన్టీఆర్ మా పెద్దాయన మనవడు. కచ్చితంగా ఆ లెగసి టీడీపీ పార్టీకి ఉపయోగపడుతుంది. యన్టీఆర్ అవసరం కూడా ఇప్పుడు పార్టీకి ఉంది. పైగా.. యన్టీఆర్ టాప్ హీరో. మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఆయన పార్టీలోకి వస్తే.. పరిస్థితి మారుతుందన్న నమ్మకం ఉంది. కుటుంబం పరంగా వారి మధ్య కొన్ని బేధాభిప్రాయాలు ఉన్న మాట వాస్తవం. కానీ.., అందరూ వాటిని పక్కన పెట్టాలి. ఈ పార్టీ మాది అన్న అభిప్రాయానికి అందరూ రావాలి. 2024లో టీడీపీని అధికారంలోకి తీసుకుని రావడానికి అందరూ కలసి పని చేయాలి” అని బుచ్చయ్య చౌదరి అభిప్రాయపడ్డారు. బుచ్చయ్య చౌదరి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి.., టీడీపీకి యన్టీఆర్ అవసరం ఉందన్న బుచ్చయ్య చౌదరి కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.