వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ ఆ పార్టీపైనే విమర్శనాస్త్రాలు సంధించే నరసాపురం నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే ఒక సారి జైలుకు వెళ్లి వచ్చిన ఆయనపై మరో కేసు నమోదు అవ్వడం రాజకీయంగా చర్చనీయాంశం అయింది. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి పోలీస్‌స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు సీఐ ఎంవీఎస్ మల్లేశ్వరరావు శుక్రవారం తెలిపారు.
సీఐడీ చీఫ్ పీవీ సునీల్‌కుమార్‌ను అసభ్య పదజాలంతో దూషించడమే కాక కులం పేరుతో అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చింతలపూడికి చెందిన గొంది రాజు, ఎయిమ్ సభ్యుడు కాకర్ల సత్యనారాయణ, ఎంఎస్ రాజేంద్ర, బుచ్చిబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. మరి రఘురామకృష్ణంరాజుపై కేసు నమోదు అవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.