సొంత పార్టీపై బైరెడ్డి సిద్దార్ద్ రెడ్డి ఫైర్. సిగ్గుచేటు అంటూ!

Byreddy

యంగ్‌ డైనమిక్‌ పొలిటిషియన్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి సొంత పార్టీపైనే సెటైర్లు వేశారు. పనికి రాని పదవి ఉంటే ఎంత? లేకుంటే ఎంత? అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన వద్దకు వచ్చే వారికి సహాయం చేయలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం బహిరంగ సభలో మాట్లాడిన ఆయన తన వెనుక 50, 60 మంది సర్పంచ్‌లు, ఎంపిటీసీలు, 5 మంది ఎంపీపీలు, ఐదుగురు జెడ్పీటీసీ సభ్యులు, మున్సిపల్‌ చైర్మన్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఉన్నట్లు వెల్లడించారు. ఈ బలం ముందు పనికి రాని ప్రొటోకాల్‌ ఎందుకని ప్రశ్నించారు. ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి అని ఆయనకు పేరుంది. కాగా ఆయనను రాష్ట్ర స్పోర్ట్స’్‌ అథారిటీ చైర్మన్‌గా నియమించిన సంగతి తెలిసిందే. దానికి అంత ప్రాధాన్యత లేదని ఆయన భావించి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్లు రాజకీయ నాయకులు చర్చించుకుంటున్నారు. మరీ బైరెడ్డి సిద్దార్థరెడ్డి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.