ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలన నిర్ణయం వెల్లడైంది. మూడు రాజధానుల బిల్లుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పొలిటికల్ హీట్ రాజేసిన మూడు రాజధానుల బిల్లును జగన్ సర్కార్ ఉపసంహరించుకోవడానికి సిద్ధమైంది. ఈ విషయాన్ని హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ తెలిపారు.
అయితే.. సీఎం జగన్ మోహన్ రెడ్డి సీఆర్డీయే రద్దు బిల్లులను రద్దు చేయడం వెనుక అసలు కారణాలు ఏమిటన్నది తెలియ రావడం లేదు. దీనిపై అసెంబ్లీలో సీఎం జగన్ కీలక ప్రకటన చేయనున్నారు. ఇదే అంశంపై ఏపీ సచివాలయంలో అత్యవసర కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. విశాఖనే పూర్తి స్థాయి రాజధానిగా ప్రకటించబోతున్నారా? లేక అమరావతికి కట్టుబడుతున్నట్టు ప్రకటన రానుందా? అసలు జగన్ వ్యూహం ఏమిటి? ఆనం విషయాలన్నీ కొత్త బిల్లులో ఉండబోతున్నట్టు తెలుస్తున్నాయి. దీంతో.., రాజధాని అంశాన్ని తేల్చే చెప్పే ఆ కొత్త బిల్లుపై అందరి ద్రుష్టి కేంద్రీకరించారు. మరి.. ఈ విషయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.