అగ్రకుల మహిళలకి జగన్ గుడ్ న్యూస్. బ్యాంక్ అకౌంట్ లోకి ఫ్రీగా రూ.45 వేల

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నా, వైసీపీ ప్రభుత్వం మాత్రం సంక్షేమం విషయంలో వెనకడుగు వేయడం లేదు. ఇప్పటికే వైసీపీ ఉచిత పధకాలపై ప్రతి పక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నా..సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిన్న మొన్నటి వరకు ఎస్సీ, ఎస్టీ, బిసి మైనారిటీ మహిళలకి మాత్రమే పరిమితమైన ‘ఈబీసీ నేస్తం’ పథకానికి ఇప్పుడు ఓసీ మహిళలని కూడా అర్హులు చేస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. ఇప్పుడు వీరి ఖాతాల్లోకి మూడు విడతల్లో రూ.45 వేల వచ్చి పడనున్నాయి. 45 నుంచి 60 సంవత్సరాల లోపు ఓసీ మహిళలు ఈ పధకానికి కొత్తగా అర్హులు అయ్యారు. వీరికి ఏడాదికి 15000/- చెప్పున మూడు సంవత్సరాలుకు 45000/- రూపాయలు అందించనున్నారు.

Rs 45000 into OC women accounts Apply like this - Suman TVలబ్ధిదారులకి ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ తప్పక ఉండాలి. వీరి వార్షిక కుటుంబ ఆదాయం గ్రామాల్లో అయితే నెలకు రూ. 10వేలు, పట్టణాలలో అయితే నెలకు రూ.12వేలకు మించి ఉండకూదదు. కుటుంబంలో ఎవరు ప్రభుత్వ ఉద్యోగి ఉండకూడదు. ఫోర్ వీలర్ ఉండకూడదు. ఇంట్లో ఇన్కమ్ టాక్స్ కడుతున్న వారు ఉండకూడదు. ఈ షరతులు అన్నీ దాటుకుని మీరు అర్హులు అయితే… అగ్రకుల మహిళలు ఈనెల 7వ తేదీలోపు సమీప గ్రామ వార్డు, సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. అప్పుడు ‘ఈబీసీ నేస్తం’ పథకానికి అర్హులు అవుతారు. మరి.. ఓసీ మహిళల కోసం జగన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.