విడాకుల తరువాత మహిళా ఐఏఎస్ పోస్ట్.. ఏకంగా 90 వేల లైకులు

స్పెషల్ డెస్క్- టీనా దాబి.. తెలుసు కదా. అదేనండీ 2017లో జరిగిన సివిల్స్ లో దేశంలోనే టాపర్ గా నిలిచిన ఐఏఎస్ అధికారిణి. రాజస్ఠాన్ కేడర్ కు చెందిన ఈ మహిళా ఐఏఎస్ అధికారిణి, తన బ్యాచ్ కు చెందిన మరో ఐఏఎస్ అధికారి అధర్ ఖాన్ ను ప్రేమించి పెళఅలి చేసుకుంది. 2018లోవీరి పెళ్లి జరగ్గా, ఇద్దరు టాప్ ఐఏఎస్ అధికారులు కావడంతో చాలా మంది ప్రముఖులు వీరి పెళ్లికి హాజరయ్యారు. భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహా చాలా మంది ఢిల్లీలో జరిగిన వీరి వివాహానికి విచ్చేశారు.

అయితే ఏమైందో తెలియదు కాని వీరి కాపురం ఎంతో కాలం నిలువలేదు. ఈ మధ్య కాలంలోనే టీనా దాబి, అధర్ ఖాన్ లు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. వీరి పెళ్లి దేశ వ్యాప్తంగా ఎంత సంచలనం అయ్యిందో, ఆ తరువాత వీరిద్దరి విడాకులు సైతం అంతే సంచలనం రేపాయి. విడాకులకు గల కారణాన్ని ఇద్దరిలో ఏ ఒక్కరు చెప్పలేదు. బలమైన కారణంతోనే ఇద్దరూ విడిపోయారని అంతా అనుకుంటున్నారు.

tina dabi

విడాకుల తరువాత టీనా దాబి, అధర్ ఖాన్ లు సైలెంట్ అయిపోయారు. ఇదిగో ఇన్నాళ్లకు విడాకుల తర్వాత మొట్ట మొదటిసారిగా టీనా దాబి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్‌కు సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఇన్ స్టాగ్రామ్ లో టీనా దాబి ఏంచెప్పిందంటే.. కలలకు మీరు చాలా దూరంలో ఉన్నారని అనిపించినపుడు, మీరు చేరుకోలేరనే అనుమానం మొదలైనపుడు, ఆ దూరాన్ని దూషించకండి, దేనికైనా సమయం పడుతుందని గ్రహించండి, సులభంగా చేరుకుంటే ఆ కలలకు విలువేముంటుంది.. అంటూ టీనా పోస్ట్ లో పేర్కొంది.

టీనా దాబి పోస్ట్‌పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇప్పటికి ఈ పోస్ట్ 90 వేల లైకులను దక్కించుకుంది. మనం నిర్ధేశించుకున్న లక్ష్యం గురించి టీనా దాబి చాలా బాగా చెప్పారని అంతా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. కొంత మంది నెటినజన్లు మాత్రం మళ్లీ పెళ్లెప్పుడు చేసుకుంటావని ఆమెను ప్రశ్నించారు. మరి వారి ప్రశ్నకు టీనా దాబి ఎలా స్పందిస్తుందో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Tina Dabi (@dabi_tina)