నన్ను మాత్రమే ఎందుకు నిందిస్తున్నారు? సమంతా ఎమోషనల్ పోస్ట్!

తెలుగు ఇండస్ట్రీలో లవబుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య-సమంత నాలుగేళ్ల తమ వైవాహిక బంధానికి గుడ్ బాయ్ చెప్పి విడాకులు తీసుకున్నారు. సోషల్ మాద్యమాల్లో అఫిషియల్ గా తాము విడిపోతున్నట్లు పేర్కొన్నారు. మోస్ట్‌ క్యూటెస్ట్‌ కపుల్‌గా పేరు తెచ్చుకున్న ఈ జంట బ్రేకప్‌ చెప్పుకోవడం ఏంటని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

sagmagr min 1సమంతకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరి విడాకుల ఎపిసోడ్ తర్వాత సమంత సోషల్‌మీడియా అకౌంట్లపై మరింత ఫోకస్‌ పెరిగింది. ఇప్పుడు సమంత చేసే ప్రతి పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. చైతూతో సమంత విడాకులు తీసుకున్న తర్వాత ఆమెపై నెగిటీవ్ కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. మరికొంత మంది ఆమెకు మద్దతు కూడా పలుకుతున్నారు.

aggb min 1తాజాగా సమంత భావోద్వేగంతో ఇన్‌స్టాలో ఓ పోస్టును షేర్‌చేసుకుంది. ‘ఎప్పుడూ మహిళలనే ప్రశ్నించే ఈ సమాజం మగవాళ్లను మాత్రం ఎప్పుడూ ప్రశ్నించదు.. అలాంటప్పుడు మనకు ప్రాథమికంగా నైతికత లేనట్లే’ అంటూ ఓ కొటేషన్‌ను ఇన్‌స్టాలో షేర్ చేసింది. మరోవైపు చైతూ విడాకుల వ్యవహారంతో సమంత తీవ్ర ఒత్తడికి గురవుతున్నట్లు ఆమె సన్నిహితులు అంటున్నారు. ఈ మద్య ఓ షూటింగ్ మద్యలో కూడా కన్నీరు పెట్టుకున్నట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. తాజాగా సమంత చేసిన పోస్ట్ మరోసాని నెట్టింట వైరల్ అవుతుంది.