రెమిడెసివర్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ తీసుకున్న నిర్ణయం సంచలనమే!..

దేశంలోని కరోనా బాధితుల చికిత్సలో ప్రముఖంగా వినిపించిన పేరు. అయితే ఆ టాపిక్ ఇప్పుడు యూటర్న్ తీసుకుంది. కోవిడ్‌ బాధితులకు ఇస్తున్న రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్‌పై తమకు అనుమానాలు ఉన్నాయ‌న్న డ‌బ్ల్యూహెచ్‌వో ఈ ఇంజ‌క్ష‌న్‌తో కరోనా రోగులు కోలుకున్నట్లు ఆధారాలు లేవని కుండ‌బ‌ద్ద‌లుకొట్టింది. కరోనా చికిత్సనుంచి రెమ్‌డెసివర్‌ను తొలగిస్తున్నట్లు ప్ర‌క‌టించింది. కోవిడ్ చికిత్స నుంచి ఒక్కొక్క‌టి త‌గ్గిపోతున్నాయి. ఇప్ప‌టికే ఫ్లాస్మా థెర‌పీతో ఉప‌యోగం లేద‌ని కేంద్రం స్ప‌ష్టం చేసిన సంగ‌తి తెలిసిందే. చికిత్సకు కీలకంగా మారిన రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది.ఇక భారత్‌లోనూ కరోనా చికిత్సకు ఉపయోగిస్తున్న రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్‌పై తమకు అనుమానాలు ఉన్నాయని కరోనా బాధితులెవరికి ఆ ఇంజక్షన్‌ వాడొద్దని భారత వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.20 04 2021 remdesivir injection 215747811618906484866మరోవైపు దేశంలో, పలు రాష్ట్రాల్లో రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్ల బ్లాక్‌ మార్కెట్‌ దందా జోరుగా నడుస్తుంది. దేశంలోని వైద్య నిపుణులు సైతం కరోనా చికిత్స విధానం నుంచి రెమ్‌డెసివర్‌ను తప్పించాలనే వాదన వినిపించారు. అయితే దేశంలో, పలు రాష్ట్రాల్లో రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్ల బ్లాక్‌ మార్కెట్‌ దందా జోరుగా నడుస్తోంది. ఇప్ప‌టికీ రాష్ట్రాల నుంచి ఈ ఇంజ‌క్ష‌న్ల కోసం కేంద్రంపై ఒత్తిడి ఉంది. ఈ త‌రుణంలో డ‌బ్ల్యూహెచ్‌వో ప్ర‌క‌ట‌నకు ప్రాధాన్య‌త ఏర్ప‌డింది.