అక్కడ పెళ్లికాని యువతులు మొబైల్ ఫోన్ వాడితే రూ.1.50 లక్షలు ఫైన్..!

banned mobiles

మొబైల్ ఫోన్.. ఇప్పుడున్న సాంకేతిక యుగంలో ప్రతీ ఒక్కరి వద్ద ఉంటుంది. ఏది లేకున్నా సరే మొబైల్ ఫోన్ మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే. అలా తయారైంది నేటి సమాజం. అయితే ఓ గ్రామంలో మాత్రం కూతురు మొబైల్ ఫోన్ వాడితే గనుక రూ.1.50 లక్షలు చెల్లించాలంటూ గ్రామ పెద్దలు తీర్మానించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే గనుక.. ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్ లోని ఓ గ్రామంలోని ఠాకూరు వర్గంలోని యువతులు మొబైల్ ఫోన్ లు వాడకుండా గ్రామంలోని పెద్దలు నిషేధించారు.

banned mobilesఅలా వాడితే గనుక జరిమానాగా తండ్రి నుంచి రూ.1.50 లక్షలు వసూలు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఇదే కాకుండా గ్రామంలోని పెళ్లిల సమయంలో డీజేలు కూడా వాడకూడదంటూ తెలిపారు. ఇక గ్రామ పెద్దలు తీసుకున్న కఠినమైన నిర్ణయాలపై కొందరు యువతీ, యువకులు స్పందించారు. నేటి ఆధునిక పోటీ ప్రపంచంలో మొబైల్ ఫోన్ వాడకం అనేది చాలా అవసరమని, అలా మొబైల్ వాడకాన్ని నిషేదించటం కరెక్ట్ కాదని వారు అభిప్రాయపడ్డారు. ఇలా గ్రామంలోని యువతులు మొబైల్ ఫోన్ వాడకుండా నిర్ణయం తీసుకున్న గ్రామ పెద్దల నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.