ఈరోజు హైదరాబాద్ లో స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.

స్వల్పంగా పెరిగిన బంగారం ధర
10గ్రా 22 క్యారెట్ 100 రూపాయలు పెరిగింది
10గ్రా 24 క్యారెట్ 110 రూపాయలు పెరిగింది
22 క్యారెట్ 10గ్రా బంగారం 44,100.
24 క్యారెట్ 10గ్రా బంగారం 48,110.
1కిలో వెండి 68,500

బిజినెస్ డెస్క్- ఈ రోజు శుక్రవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. గురువారంతో పోలిస్తే 22 క్యారెట్ గోల్డ్ గ్రాము 10 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్ గోల్డ్ ధర కూడా గ్రాముకు 11 రూపాయలు పెరిగింది. ఇక హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 100 రూపాయలు పెరిగి 44 వేల 100 రూపాయలు చేరింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 110 రూపాయలు పెరిగి 48 వేల 110 రూపాయలకు చేరింది. ఇక ఈ రోజు వెండి 200 రూపాయలు పెరిగింది. దీంతో ఈ రోజు మార్కెట్లో వెండి కిలొ 68 వేల 500 రూపాయలు పలుకుతోంది. గత పది రోజుల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 200 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములు 220 రూపాయలు తగ్గింది.

Gold 1 1

ఇక చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం 44 వేల 510 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ బంగారం 10 గ్రాములు 48,560 రూపాయలుగా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ బంగారం 10 గ్రాములు 45,990 రూపాయులుండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం 46,990 రూపాయలు పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం 46,090 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాములు 50,290 రూపాయలుగా ఉంది. రేపు కూడా బంగారం ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం దిగుమతులు తగ్గడం బంగారం ధరలపై ప్రభావం చూపుతోందని నిపుణులు అంటున్నారు.