మసాజ్ సెంటర్ పేరిట హైటెక్ వ్యభిచారం… గుట్టు రట్టు!

హైదరాబాద్ లోని స్పా సెంటర్ ముసుగులో హైటెక్ ప్రాస్టిట్యూషన్ చేస్తున్నారు. ఈ ముఠా సభ్యులు, ఎవరికి అనుమానం రాకుండా కొంతకాలంగా సీక్రెట్ గా వ్యభిచారం చేయిస్తున్నారు. ఈజీ మనీ కోసం కొంత మంది ఆడవాళ్లను వ్యభిచారం రొంపిలోకి దించుతూ అడ్డగోలుగా డబ్బు సంపాదిస్తున్నారు. అయితే ఈ దళారులకు కొంద మంది పోలీసుల సహకారం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. కానీ కొన్ని చోట్ల మాత్రం పోలీసులు పక్కా సమాచారంతో ఇలాంటి స్పా సెంటర్స్ పై దాడి చేసి హైటెక్ వ్యభిచారం గుట్టు రట్టు చేస్తున్నారు.

vahrgbchar minతాజాగా హైదరాబాద్ లోని ఓ అపార్ట్ మెంట్ లో మసాజ్ సెంటర్ ముసుగులో గుట్టుగా వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు దాడిచేసి మగ్గురు మహిళలతో పాటు నిర్వహకుడు, ఓ విటుడిని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ లోని కుత్బుల్లాపూర్ వెన్నెలగడ్డలో ఓ అపార్ట్ మెంట్ లో పర్సుల్ బ్యూటీ స్పా ఆండ్ సెలూన్ ను ఓ వ్యక్తి నిర్వహిస్తున్నాడు. ఇందుకోసం టెక్నాలజీ వాడుకుంటూ విటులను ఆకర్షించి అమ్మాయిలతో వ్యభిచారం నిర్వహిస్తున్నాడు.

saprg minఅయితే గత కొంత కాలంగా ఈ స్పా సెంటర్ కి అబ్బాయిలు.. అమ్మాయిలు ఎక్కువగా రావడంతో స్థానికులకు అనుమానం వచ్చి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు స్పా సెంటర్ పై దాడి చేసి నిర్వహకుడితో పాటు ముగ్గురు మహిళలు, ఓ విటుడిని అరెస్ట్ చేశారు.