కేటీఆర్ కి ఫైన్ వేసిన ట్రాఫిక్ పోలీస్ కి సన్మానం..

ktr trafficpolice hyderabad

రాంగ్‌రూట్‌లో వస్తున్న తన కారును అడ్డుకుని, ఫైన్‌ వేసిన ట్రాఫిక్‌ పోలీసులను మంత్రి కేటీఆర్‌ అభినందిచారు. నిబంధనల ప్రకారం పని వారిని సోమవారం తన కార్యాలయానికి పిలిపించుకున్న మంత్రి కేటీఆర్.. వారి నిజాయితీని ప్రశంసించారు. నిబంధనలు ప్రజలకైనా, ప్రజా ప్రతినిధులకైనా ఒకటే అని మంత్రి కేటీఆర్ అన్నారు. నిబంధనల ప్రకారం పని చేసే ఐలయ్య లాంటి అధికారులకు తామెప్పుడూ అండగా ఉంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడంలో తాను ఎప్పుడూ ముందు ఉంటానని, చలాన్ విధించిన రోజున వాహనంలో తాను లేనని కేటీఆర్ అన్నారు.

గాంధీ జయంతి రోజున బాపూ ఘాట్ వద్ద అనుకోని పరిస్థితుల్లో రాంగ్ రూట్‌లో వచ్చిన తన వాహనానికి నిబంధనల ప్రకారం చలాన్ విధించిన ఎస్ఐ ఐలయ్య, కానిస్టేబుల్ వెంకటేశ్వర్లను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. గాంధీ జయంతి సందర్భంగా శనివారం బాపూఘాట్‌ వద్ద మంత్రి కేటీఆర్ నివాళులర్పించేందుకు వెళ్లినప్పుడు ఆయన కారును ట్రాఫిక్ ఎస్‌ఐ అడ్డుకున్న విషయం తెలిసిందే. రాంగ్‌రూట్‌లో మంత్రి కారు రావడంతో అక్కడ విధుల్లో ఉన్న ట్రాఫిక్‌ ఎస్‌ఐ ఐలయ్య అడ్డుకున్నారు. రాంగ్‌ రూట్‌లో ఎందుకొస్తున్నావు? వెనక్కి వెళ్లు అని డ్రైవర్‌కు సూచించారు.

ఇదీ చదవండి: ఈటల ఉద్వేగం: నేను సీఎం అవ్వాలని ప్రయత్నం చేయలేదు