టీఆర్ఎస్ ప్లీనరీలో ఘుమ ఘుమ లాడే వంటకాలు… మెనూ ఇదే..!

తెలంగాణ రాష్ట్ర సమితి ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న పార్టీ ప్లీనరీకి హైదరాబాద్‌ మహా నగరం ముస్తాబైంది. మాదాపూర్ లోని హెచ్ఐసీసీ హైటెక్స్ లో జరగనున్న ప్లీనరీకి దాదాపు 6 వేల మంది టీఆర్ఎస్ పార్టీ సభ్యులు హాజరవుతారని అంచనా. వారి కోసం నోరూరించే వంటకాలతో భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. పార్టీ ప్రతినిధులతో జరుగనున్న ఈ ప్లీనరీకి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులు నగరానికి రానుండటంతో నగరం నలువైపులా స్వాగత తోరణాలు, ప్రధాన కూడళ్లలో పార్టీ జెండాలు, అధినేతల ఫొటోలతో అలంకరించారు.

ఇది చదవండి: బాల్కసుమన్ పై జగ్గారెడ్డి ఫైర్.. ఓడిపోతే నీ బతుకేంటో చూసుకో!

image 0 compressed 132ఇక ప్లీన‌రీకి హాజ‌ర‌య్యే టీఆర్ఎస్ ప్ర‌జాప్ర‌తినిధుల‌కు నోరూరించే వంట‌కాల‌ను సిద్ధం చేస్తున్నారు. ప్లీన‌రీలోని వంట‌ల ప్రాంగ‌ణం రుచిక‌ర‌మైన వంట‌కాల‌తో ఘుమ‌ఘుమ‌లాడుతోంది. మాంసాహార, శాకాహార వంటకాలు, స్నాక్స్ తో మెనూ సిద్ధమైంది. మెనూలో ప్రధానంగా తెలంగాణ రుచులు వండి వార్చనున్నారు. అంతేకాదు ఇతర ప్రాంతానికి సంబంధించిన వంటకాలు కూడా ఈ మెనులో చేర్చారు. క‌డుపు నిండా భోజ‌నం వ‌డ్డించేందుకు వంట‌కాల‌ను సిద్ధం చేస్తున్నారు. మొత్తం 33 ర‌కాల వెరైటీల‌ను ఏర్పాటు చేశారు.

ఇది చదవండి: రష్మీ ప్రభాకర్‌ పెళ్లి ఫోటోలు వైరల్..! షాక్ లో ఫ్యాన్స్!

image 1 compressed 127టీఆర్ఎస్ ప్లీనరీ వంటకాల జాబితా:

చికెన్‌ధమ్‌ బిర్యానీ, ధమ్‌కా చికెన్‌,తెలంగాణ నాటు కోడి కూర,గులాబ్‌జామ్‌, మిర్చిబజ్జీ, రుమాలీ రోటీ, మిర్చి గసాలు, ఆనియన్‌ రైతా, మటన్‌కర్రీ, తలకాయ కూర, బోటీదాల్చా, కోడిగుడ్డు పులుసు, బగారా రైస్‌, మిక్స్‌డ్‌ వెజ్‌ కుర్మా, డబుల్‌కామీట, వైట్‌ రైస్‌, మామిడికాయ పప్పు, దొండకాయ, కాజుఫ్రై, గుత్తి వంకాయ, చామగడ్డ పులుసు, ములక్కాడ, కాజు, టమాట కర్రీ,వెల్లిపాయ కారం, టమాట, కొత్తిమీర తొక్కు, మామిడికాయ తొక్కు, పప్పుచారు అప్పడం, పచ్చిపులుసు, ఉలువ చారు క్రీమ్‌,టమాట రసం, పెరుగు, బటర్‌స్కాచ్‌ ఐస్‌క్రీమ్‌, ఫ్రూట్స్‌ స్టాల్‌, అంబలి, బటర్‌ మిల్క్‌.

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.