హైదరాబాద్‌ నిమ్స్‌లో గుండె మార్పిడి.. అరుదైన శస్త్ర చికిత్స

heart surgery nims hyderabad

హైదరాబాద్‌లో గ్రీన్‌ చానెల్‌ ఏర్పాటు చేసి మరోసారి గుండెను తరలించనున్నారు. మలక్‌పేటలోని యశోద ఆస్పత్రిని నుంచి పంజాగుట్ట నిమ్స్‌ ఆస్పత్రికి గుండెను తరలించనున్నారు. ప్రమాదానికి గురై బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తి నుంచి గుండె సేకరణ. ఈ నెల 12న గొల్లగూడెంలో ప్రమాదానికి గురైన కానిస్టేబుల్‌ వీరబాబు గుండెను నిమ్స్‌ ఆస్పత్రికి తరలించనున్నారు. గుండెను నిమ్స్‌లో చికిత్స పొందుతున్న తుపాకుల హుస్సేన్‌కు అమరుస్తారు. హుస్సేన్‌ పెయింటర్‌గా పనిచేస్తాడు. గతంలో కూడా నాగోల్‌ నుంచి జూబ్లీ చెక్‌ పోస్టు వరకూ మెట్రో ద్వారా అపోలోకు గుండెను గ్రీన్‌ చానెల్‌ ద్వారా తరలించారు. అది విజయవంతం అయింది.