హైదరాబాద్ లో భారీ వర్షం.. థియేటర్ ను ముంచెత్తిన వరద నీరు

Dilsukhnagar Theatre - Suman TV

శుక్రవారం రాత్రి కురిసిన కుండపోత వర్షానికి హైదరాబాద్ జంట నగరాల్లోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఏకంగా రెండు గంటల పాటు కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. దీంతో చాలా చోట్ల ట్రాఫిక్ సమస్యతో వాహనదారులు రెండు మూడు గంటలుగా ఇబ్బందులకు గురయ్యారు. ఇదే కాకుండా ఎల్బీ నగర్ ప్రాంతంలో ఓ వ్యక్తి మ్యాన్ హోల్ లో కొట్టుకుపోయి ఆ తర్వాత సురక్షితంగా బయటపడ్డాడు.

Dilsukhnagar Theatre - Suman TVఇక దీంతో పాటు శుక్రవారం కురిసిన వర్షానికి దిల్ షుఖ్ నగర్ లోని శివగంగ థియేటర్ గోడకూలి ఏకంగా థియేటర్ లోకి వరద నీరు భారీగా చేరుకుంది. దీంతో థియేటర్ లోని సీట్లన్నీ వరద నీటిలో నిండిపోయాయి. ఇక దీంతో పాటు పార్కింగ్ లో ఉన్న వాహనాలన్నీ దెబ్బతినటంతో పాటు వాహనాలన్నీ నుజ్జు నుజ్జు అయ్యాయి. పరిహారం చెల్లించాలటూ వాహనదారుల డిమాండ్ చేస్తున్నారు. ఇక రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ అధికారులు పరిస్థితులను పర్యవేక్షించారు. తాజాగా కుండపోత కురిసిన వర్షానికి నగర వాసులు చాలా ఇబ్బందులకు గురయ్యారు.