ఫుట్ పాత్ పై మహిళ ధీనస్ధితి.. వాహనదారులను కదిలిస్తున్న దృశ్యం

road side mother and child

జోరుగా కురుస్తున్న వర్షాలు.. అందులో తోడైన చలి. ఇలాంటి విపత్కర వాతావరణ పరిస్థితుల్లో కూడు, గుడ్డ లేని వారి పరిస్థితి వర్ణనాతీతమనే చెప్పాలి. తినటానికి తిండి లేక ఎక్కడబడితే అక్కడ పడుకుంటున్నా వారి ఘటనలు కన్నీళ్లు పెట్టిస్తుంటాయి. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్ నగరం బొడ్డున చోటు చేసుకుంది. కానీ ఈ హృదయ విదారకమైన ఘటనను అందరు చూస్తూ వదిలేసిన ఓ అధికారి మాత్రం మానవత్వంతో చలించిపోయి ఆదుకున్నాడు.

ఇక విషయం ఏంటంటే..? నగరంలోని సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ వద్ద పికెట్ 6రోడ్ల కూడలి లో ఫూట్ పాత్ పై ఓ మహిళ, పసి వాణ్ణి పొత్తిళ్లలోకి దాచుకుని ఆ బాలుడిని చలి నుంచి రక్షిస్తూ కాపడుతోంది. అయితే అటుగా వెళ్తున్న వాహనదారులు మాత్రం చూస్తు ఉండిపోయారు. కానీ బాధ్యత గల అధికారైన పౌరసరఫరాలశాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ ఆ మహిళ వద్దకు వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నాడు.

ఇక ఆహారం, దుస్తువుల కొనుక్కొమని కొంత డబ్బు చేతికందించాడు. ఇంతటితో ఆగకుండా ఓ స్వచ్ఛంద సంస్థకు మహిళ సమాచారం అందించి ఆ మహిళకు నిత్యవసర సరుకులు అందజేయాల్సిందిగా అధికారి రఘునందన్ కోరారు. ఇక ఇలాంటి సాయం చేసిన బాధ్యత గల అధికారి తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.