వివాహితతో ఎస్ఐ అక్రమ సంబంధం.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త

వనపర్తి- ఈ మధ్య కాలంలో సమాజంలో అక్రమ సంబంధాలు మితిమీరిపోతున్నాయి. చక్కగా కాపురం చేసుకోవాల్సిన భార్యా భర్తల్లో ఎవరో ఒకరు మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుని కాపురాలను కూల్చుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు ఎన్ని జరిగినా మళ్లీ ఎక్కడో ఓ చోట అక్రమ సంబంధాలు బయటపడుతూనే ఉన్నాయి.

తాజాగా వనపర్తి జిల్లాలో ఓ కీచక ఎస్ఐ రాసలీలలు బయటపడ్డాయి. స్థానికంగా ఓ వివాహితను లొంగదీసుకుని ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఎస్ఐని ఆమె భర్త రెడ్‌ హ్యాండెడ్‌ గా పట్టుకుని చితకబాదిన ఘటన సంచలనంగా మారింది. షేక్ షఫీ వనపర్తి రూరల్ ఎస్ఐ గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో గత కొంత కాలంగా వనపర్తికి సమీపంలోని కొత్తకోటకు చెందిన ఓ వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. రెగ్యులర్ గా ఆమెతో ఫోన్లో మాట్లాడుతున్న ఎస్ఐ షఫీ, భర్తలేని సమయంలో ఇంటికి వెళ్లి రాసలీలలు సాగిస్తున్నాడు.

Wanaparthy 1

తాజాగా ఈ విషయం స్థానికులు, స్నేహితుల ద్వార ఆ వివాహిత భర్తకు తెలిసింది. దీంతో వాళ్లిద్దరిని రెడ్‌ హ్యాండెడ్‌ గా పట్టుకోవాలని ఆ భర్త పధకం వేశాడు. ఈ నెల 18న బయటకు వెళ్తున్నట్లు భార్యకు చెప్పి ఇంటికి సమీపంలోనే మాటు వేశాడు. ఇంకేముంది ఆ మహిళ తన ప్రియుడు ఎస్‌ఐ షఫీ కి ఫోన్ చేయగా అతడు క్షణాల్లోనే ప్రియురాలి ఇంటికి వచ్చేశాడు. వాళ్లిద్దరు రాసలీలల్లో మునిగితేలుతుండగా భర్త తన స్నేహితులతో కలిసి వెళ్లి, వారిని రెడ్‌ హ్యాండెడ్‌ గా పట్టుకున్నాడు. స్నేహితులతో కలిసి ఎస్ఐ షఫీని ఆమె భర్త చితకబాదారు. అడ్డొచ్చిన భార్యను సైతం కొట్టారు.

ఈ విషయం బయట తెలిస్తే తన పరువు పోతుందని, తనను వదిలిపెట్టాలని ఎస్ఐ ప్రాధేయపడినా ఆవేశంలో ఉన్న వాళ్లంతా కొట్టడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న కొత్తకోట పోలీసులు వెంటనే అక్కడికి వచ్చి ఎస్ఐని కాపాడి వనపర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యుల సలహా మేరకు అతడిని హైదరాబాద్‌ కు తరలించారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు ఎస్ఐ‌ షేక్ షఫీని సస్పెండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకును విచారణ చేపట్టారు.