సమాజంలో నేరాలను నియంత్రించి, శాంతి భద్రతలను కాపాడటంలో రక్షణ వ్యవస్థదే కీలక పాత్ర. ప్రజా సేవ చేయాలనే ఆశయంతో పోలీస్ ఉద్యోగాలు సాధించడం కోసం అహర్నిశలు కష్టపడ్డి చదివి తుది పరీక్షలు రాసిన కానిస్టేబుల్, ఎస్ఐ అభ్యర్థలకు టిఎస్ ఎల్ పిఆర్ బి శుభవార్త అందించింది.

తెలంగాణలో కానిస్టేబుల్, ఎస్ఐ తుది పరీక్షల ఫలితాలను టిఎస్ ఎల్ పిఆర్ బి విడుదల చేసింది. మార్చి-ఏప్రిల్ లో నిర్వహించిన తుది రాత పరీక్షల ఫలితాలకు సంబంధించి ప్రాసెస్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. మొత్తం 8 నోటిఫికేషన్లకు సంబంధించి తుది రాత పరీక్షలు నిర్వహించారు. అయితే వీటి ఫలితాలపై టిఎస్ ఎల్ పిఆర్ బి కీలక ప్రకటన చేసింది. ఎంత మంది ఈ పోస్టులకు అర్హత సాధిచారనే వివరాలను వెల్లడించింది.ఎస్ఐ సివిల్ ఉద్యోగాలకు 57,848 మంది పరీక్ష రాయగా, 43,708 మంది అర్హత సాధించినట్లు తెలిపారు.
కానిస్టేబుల్ ఐటీ ఉద్యోగాలకు 4,564 మంది అర్హత సాధించగా, ఐటీ ఎస్ఐ ఉద్యోగాలకు 729 మంది అర్హత సాధించారు. కానిస్టేబుల్ డ్రైవర్ ఉద్యోగాలకు 1779 మంది అర్హత సాధించగా, ఫింగర్ ప్రింట్ బ్యూరో ఉద్యోగాలకు 1153 మంది అర్హత సాధించినట్లు తెలిపారు.ఇక పిటిఓ ఎస్ఐ ఉద్యోగాలకు 463 మంది అర్హత సాధించగా, పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్ ఉద్యోగాలకు 238 మంది అర్హత సాధించారు. మొత్తం అన్ని ఉద్యోగాలకు సంబంధించి 84 శాతం మంది అర్హత సాధించినట్లు తెలిపారు. ఇక అభ్యర్థుల యొక్క పర్సనల్ లాగిన్ లో ఓఎంఆర్ షీట్లను నేడు రాత్రి అప్ లోడ్ చేయనున్నట్లు వెబ్ నోట్ లో ప్రకటించారు. దీంతో పాటే అభ్యర్థి యొక్క ఫలితాలు కూడా విడుదల చేయనున్నారు. ఫైనల్ కీ, ఓఎంఆర్ షీట్లు తమ వ్యక్తిగత లాగిన్ లో చూసుకోవచ్చని టిఎస్ ఎల్ పిఆర్ బి తెలిపింది.