తమ బిడ్డల వివాహాలు చూసుకోవాలని ప్రతి తల్లిదండ్రులు ఎంతో ఆశగానో ఎదురు చూస్తుంటారు. అలానే ఎంతో మంది తల్లిదండ్రులు తమ బిడ్డల వివాహలు జరిపిస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో పెళ్లి ఇళ్లు.. విషాదాలకు వేదికగా మారుతున్నాయి. తాజాగా ఓ ఇంట్లో పెళ్లి భాజాలు మోగిన గంటల వ్యవధిలోనే చావు వార్త వినిపించింది
ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది మధురమైన జ్ఞాపకం. అందుకే తమ పెళ్లిని ఎంతో ఘనంగా చేసుకోవాలని యువత కోరుకుంటుంది. అలానే తమ బిడ్డల వివాహాలు చూసుకోవాలని తల్లిదండ్రులు ఎంతో ఆశగానో ఎదురు చూస్తుంటారు. ఎంతో మంది యువత తమ కలలను నిజం చేసుకుంటూ పెళ్లి పీటలెక్కి.. కొత్త జీవితంలోకి అడుగు పెడుతుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో పెళ్లి ఇళ్లు.. విషాదాలకు వేదికగా మారుతున్నాయి. తాజాగా ఓ ఇంట్లో పెళ్లి బాజాలు మోగిన గంటల వ్యవధిలోనే చావు వార్త వినిపించింది. ఈ విషాద ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణానికి చెందిన గోపి, లక్ష్మి(40) దంపతులు. ఈ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారిలో పెద్ద కుమార్తె హారికను వీపన గండ్ల మండలం గోపల్ దిన్నెకు చెందిన దయాకర్ కి ఇచ్చి గురువారం వివాహం జరిపించారు. హారిక, దయకర్ ల వివాహం పెబ్బేరులో జరిగింది. పెళ్లి.. హారిక తల్లి లక్ష్మి అందరితో సరదాగా కబుర్లు చెబుతూ సంబురాలను చేసింది. కుమార్తె వివాహ వేడకలకు వచ్చిన బంధువులను ఎంతో ఆప్యాయంగా పలకరించింది. వివాహ అనంతరం గోపి, లక్ష్మి దంపతులు బైక్ పై కొత్తకోటకు బయలు దేరారు.
నాటవెళ్లి గ్రామ సమీపంలోకి రాగానే లక్ష్మి ప్రమాదవశాత్తు బైక్ పై నుంచి జారి కింద పడిపోయింది. దీంతో ఆమె తలకు తీవ్రమైన గాయమయ్యింది. స్థానికులు సాయంతో వెంటనే ఆమెను అంబులెన్స్ లో స్థానిక ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మరణించింది. దీంతో గురువారం పెళ్లి బాజాలతో సందడిగా ఉన్న ఇంట్లో శుక్రవారం విషాదం నెలకొనడం అందరినీ కలచివేసింది. తల్లి మృతదేహాన్ని చూసిన పెళ్లి కుమార్తె కన్నీరుమున్నీరు గా విలపించింది. మరి.. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.