ట్రిపుల్ ఆర్ కథ చెప్పేశావంటూ రాజమౌళి సీరియస్! నాన్నపై అలిగిన జక్కన్న!

రాజమౌళి ఇండియన్ సినీ జోన్ లో ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. బాహుబలితో తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాతరాలు దాటించిన ఘనత ఈ దిగ్దర్శకుడి సొంతం. ఒక్కో సినిమాకి అంతలా కష్టపడతాడు కాబట్టే ఈ రాజమౌళి అంటే సక్సెస్ కి బ్రాండ్ లా నిలవగలిగారు. అయితే.., రాజమౌళి ఈ వరుస విజయాల వెనుక ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కృషి చాలానే ఉంది. మగధీరుడి అన్నీ చిత్రాలకి కథ అందించేది వాళ్ళ నాన్నగారే. ఇక రాజమౌళి సినీ ఓనమాలు దిద్దింది కూడా ఆయన దగ్గరే. ఇందుకే తన తండ్రి అంటే రాజమౌళికి విపరీతమైన గౌరవం. కానీ.., తండ్రిని ఇంతలా ప్రేమించే రాజమౌళి ఇప్పుడు ఆయన చేసిన ఓ పనికి పూర్తిగా అప్సెట్ అయ్యారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. విజయేంద్రప్రసాద్ రీసెంట్ గా అలీ హోస్ట్ గా చేస్తున్న ఓ పోగ్రామ్ కి గెస్ట్ గా వెళ్లారు. ఈ ఇంటర్వ్యూ లో భాగంగా విజయేంద్రప్రసాద్ తన జీవితానికి సంబంధించిన అనేక విషయాలను ప్రేక్షకులతో షేర్ చేసుకున్నారు. కానీ.., ఇదే సమయంలో ఆర్.ఆర్.ఆర్ కి సంబంధించిన కొన్ని లీక్స్ కూడా ఇచ్చేశారు.

nana 2కథలో భాగంగా రామ్ చరణ్ – జూనియర్ ఎన్టీఆర్ ఫైట్ చేసుకుంటారని, ఆ ఫైట్ చూసి తాను ఏడ్చేశానని విజయేంద్రప్రసాద్ చెప్పేశారు. నిజానికి ఆయన ఇలా కధలో కీలకమైన విషయాన్ని బయటకి చెప్పేస్తారని ఎవ్వరూ ఉహించలేదు. ఇలాగే.., అజయ్ దేవ్ గన్ లాంటి హీరో ఉన్నప్పటికీ అలియా భట్ రోల్ హైలెట్ అని పదే పదే చెప్పడం కూడా లీకేజ్ లో భాగం అయిపోయింది. వీటన్నిటికీ తోడు ట్రిపుల్ ఆర్ అనంతరం హాలీవుడ్ రేంజ్ సినిమా ఉంటుందని ముందే లీక్ చేసేశారు. ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్ కు వెళితే జక్కన్నను దాని గురించి అడగకుండా ఉండరు. విసుగు వచ్చే దాకా దానిపైనే ప్రశ్నలు వేయడం ఆపరు. ముఖ్యంగా ట్రిపుల్ ఆర్ విషయంలో ఇక ఇన్ని లీక్స్ ఇచ్చిన విజయేంద్రప్రసాద్ కొడుకును కాస్త అప్సెట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఇక ప్రస్తుతం కరోనా కారణంగా ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ ఆగిపోయిన విషయం తెలిసిందే. షూటింగ్ కి మళ్ళీ సమయం అనుకూలిస్తే.. వచ్చే నెల నుండి ట్రిపుల్ ఆర్ షూట్ పట్టాలెక్కబోతున్నట్టు తెలుస్తోంది. మరి ఈ గ్యాప్ లో లీక్ లకి ఫుల్ స్టాప్ పెట్టడానికి రాజమౌళి ఏదైనా కీలక నిర్ణయం తీసుకుంటారేమో చూడాలి.