మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ‘వియన విధేైయ రామ’ మూవీలో నటించిన బాల నటుడు బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడిని మీద పలు మీమ్స్ ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి.
కొన్ని సినిమాలు అనుకున్నంతగా ఆడకపోయినా కానీ అందులో యాక్ట్ చేసిన వారికి, వర్క్ చేసిన టెక్నీషియన్లకి మంచి రికగ్నైజేషన్ వస్తుంటుంది. ఇక బాల నటుల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 1990, 2000ల టైంలోని చైల్డ్ ఆర్టిస్టులు చాలా మంది తర్వాత హీరో హీరోయిన్లుగా టాలీవుడ్‌లో రాణిస్తున్నారు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ‘వియన విధేైయ రామ’ మూవీలో నటించిన బాల నటుడు బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడిని మీద పలు మీమ్స్ ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి. ఇంతకీ ఈ బుడ్డోడు ఎవరు?.. ఫస్ట్ సినిమాతోనే ఆడియన్స్‌ని ఆకట్టుకున్న అతగాడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?..
చరణ్ – బోయపాటి కాంబోలో.. 2019 సంక్రాంతికి భారీ అంచనాలతో వచ్చిన ‘వినయ విధేయ రామ’ ఊహించని విధంగా డిజాస్టర్ అయింది. అయితే చిన్నప్పటి చరణ్‌గా కనిపించిన బుడ్డోడు మాత్రం భలే ఫేమస్ అయ్యాడు. అతని పేరు రోషన్ రాయ్. ‘అన్నయ్యలు చదువుకుంటారు.. నేను పని చేస్తాను’ అని చెప్పే డైలాగ్ ఫేమస్. ఇక అతని ఫేష్ ఎక్స్‌ప్రెషన్స్ అయితే మరో హైలెట్. ఇంతకీ రోషన్ ఎవరంటే.. బోయపాటి శ్రీను కజిన్ అట. యాక్టింగ్ అంటే ఇష్టం అని చెప్పడంతో ఇందులో స్మాల్ రోల్ ఇచ్చారు.
మనోడు వీర లెవల్లో విజృంభించేసే సరికి మరిన్ని ఆఫర్స్ వచ్చాయి. ‘కళ్యాణ వైభోగమే’ అనే సీరియల్‌లో ‘చారుకేశ’ అనే పాత్రతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అలాగే పలు తెలుగు సినిమాల్లోనూ నటిస్తున్నాడు రోషన్. అంతకుముందు బాలయ్య – బోయపాటి కాంబోలో వచ్చిన సెకండ్ ఫిల్మ్ ‘లెజెండ్’ లో బోయపాటి శ్రీను తన కూతురిని ఇంట్రడ్యూస్ చేశాడు. బాలయ్య మేనకోడలిగా కనిపించి.. ‘మామయ్యా’ అని పిలిచే డైలాగ్‌తో పాపులర్ అయింది. దీనిపై ఎన్నో మీమ్స్ కూడా వచ్చాయి.