కొరటాల మూవీలో ఎన్టీఆర్‌ క్యారెక్టర్!?..

జూనియర్‌ ఎన్టీఆర్‌ – కొరటాల కాంబినేషన్‌లో ఓ సినిమా రానుందని అనౌన్స్‌ చేసినప్పటి నుంచే  ఈ మూవీపై బజ్‌ క్రియేట్‌ అయ్యింది. జనతా గ్యారేజ్‌’ (2016) తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఎన్టీఆర్, కొరటాల శివ  ఇప్పుడు కలిసి పని చేయనున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరూ వారి వారి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.

Jr NTR New Look Photos in Temper 1 0

ప్రస్తుతం ఎన్టీఆర్‌ .‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూటింగ్‌ చేస్తుండగా, కొరటా ‘ఆచార్య’  సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలు పూర్తైన వెంటనే ఈ ఇద్దరూ కలిసి పనిచేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొరటాల – ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో వచ్చే సినిమా ఎలా ఉండబోతుంది? ఎన్టీఆర్‌ లుక్‌ ఎలా ఉండబోతుందది? ఈ సినిమా కథేంటి?.ఇలా రకరకాల ప్రశ్నలు ఫ్యాన్స్‌లో ఆసక్తిని రేకేత్తిస్తున్నాయి.

60784721d6504

కొరటాల శివ సినిమాలను పరిశీలిస్తే, తెరపై తాను చెప్పదలచుకున్న కథ విషయంలో ఆయన ఎంత క్లారిటీగా ఉంటారో అర్థమవుతుంది. కథ పట్టుకుని సెట్స్ పైకి వచ్చిన తరువాత ఇక ఆయనలో తడబాటు ఉండదు. ఏ మోతాదులో  వినోదం ఉండాలో ఏ మోతాదులో సందేశం ఉండాలో ఆయనకి బాగా తెలుసు. అందువల్లనే ఇంతవరకూ ఆయన హిట్టు మాటనే విన్నారు. అలాంటి కొరటాల ‘ఆచార్య’ తరువాత ఎన్టీఆర్ తో ఒక సినిమాను చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన కథపైనే ఆయన కసరత్తు చేస్తున్నారట. ప్రస్తుతానికైతే కథానాయికగా కైరా అద్వాని పేరు వినిపిస్తోంది.జూనియర్‌ ఎన్టీఆర్, – కొరటాల కాంబినేషన్‌లో ఓ సినిమా రానుందని అనౌన్స్‌ చేసినప్పటి నుంచే  ఈ మూవీపై బజ్‌ క్రియేట్‌ అయ్యింది.