దేశంలో కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి శరవేగంగా వుంది. ఈ వైరస్ దెబ్బకు ప్రజలు నానా ఇబ్బందులుపడుతున్నారు. ఈ క్రమంలో కొందరు ప్రాణాలను కోల్పోతున్నారు. మరికొందరు ప్రాణాలను నిలుపుకునేందుకు ప్లాస్మా కావాలంటున్నారు. అందువల్ల కొవిడ్ వారియర్స్ ప్లాస్మాను దానం చేసి ప్రాణదాతలు కావాలని టాలీవుడ్ అగ్రహీరోలు చిరంజీవి, అక్కినేని నాగార్జునలు విజ్ఞప్తి చేశారు. కొవిడ్ నుంచి కోలుకున్నవారు ప్లాస్మాను దానం చేసి కష్ట సమయంలో ప్రాణాలను కాపాడాలన్నారు నాగార్జున. టీ హోప్ అనే స్వచ్చంద సంస్థలో […]
జూనియర్ ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్‌లో ఓ సినిమా రానుందని అనౌన్స్ చేసినప్పటి నుంచే ఈ మూవీపై బజ్ క్రియేట్ అయ్యింది. జనతా గ్యారేజ్’ (2016) తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఎన్టీఆర్, కొరటాల శివ ఇప్పుడు కలిసి పని చేయనున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరూ వారి వారి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ .‘ఆర్‌ఆర్‌ఆర్’ షూటింగ్ చేస్తుండగా, కొరటా ‘ఆచార్య’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలు పూర్తైన వెంటనే ఈ ఇద్దరూ […]
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఢిపరెంట్ డైరెక్టర్ సుకుమార్ హాట్రిక్ కలయికలో వస్తోన్న చిత్రం ‘పుష్ప’. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంపై టాలీవుడ్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా గతేడాది ఈ సినిమా ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేసారు. అల్లు అర్జున్- సుకుమార్ క్రేజీ కాంబోలో కొత్త సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. బన్నీ కెరీర్‌లో 20వ సినిమాగా ఈ చిత్రం రూపొందుతోంది. మునుపెన్నడూ […]
మలయాళ సూపర్‌హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రం తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే! పవన్‌కల్యాణ్, రానా కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సాగర్.కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్ర్కీన్‌ప్లే అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాను సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ సినిమాకు ‘బిల్లా రంగా’ అనే టైటిల్‌ను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ అవకాశం ఇప్పుడు నిత్యామీనన్‌కి దక్కిందని, దాదాపు నిత్యామీనన్ కథానాయికగా […]
కథలే హీరోలుగా వచ్చిన చాలా సినిమాలు ఈమధ్య కాలంలో మంచి హిట్లయ్యాయి. ఉదాహరణకు ‘కేరాఫ్ కంచరపాలెం’. ఇందులో నటించినవారు ఒక్కరంటే ఒక్కరు కూడ ప్రేక్షకులకు తెలిసినవాళ్ళు కాదు. కానీ సినిమా మ్యాజిక్ చేసింది. అందుకు కారణం అందులోని కథే. ‘లాంగ్ డ్రైవ్’, ‘వై మీ’ వంటి షార్ట్‌ఫిల్మ్స్‌తో నెటిజన్లకు చేరువైన దర్శకుడు ప్రవీణ్. ప్రస్తుతం ఆయన దర్శకుడిగా పూర్తి స్థాయి నిడివి ఉన్న చిత్రంతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకునేందుకు సిద్ధమవుతున్నారు. విభిన్నకథతో ఆయన తెరకెక్కించిన సరికొత్త చిత్రం […]