మలయాళ సూపర్‌హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రం తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే! పవన్‌కల్యాణ్, రానా కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సాగర్.కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్ర్కీన్‌ప్లే అందిస్తున్నారు.
సితార ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాను సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ సినిమాకు ‘బిల్లా రంగా’ అనే టైటిల్‌ను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ అవకాశం ఇప్పుడు నిత్యామీనన్‌కి దక్కిందని, దాదాపు నిత్యామీనన్ కథానాయికగా ఖరారైనట్లు చిత్ర వర్గాల నుంచి సమాచారం. ఆమె ఇతర చిత్రాలతో బిజీగా ఉండడం వల్ల ఇంకా ఈ సినిమా సెట్‌లో అడుగుపెట్టలేదట.
ప్రస్తుతం కరోనా సెకెండ్ వేవ్ వల్ల షూటింగ్‌లు తాత్కాలికంగా ఆగిన సంగతి తెలిసిందే. పరస్థితులు సర్దుకున్నాక నిత్యామీనన్ సెట్‌లో అడుగుపెడతారట. రానాకు జోడీగా ఐశ్వర్యా రాజేశ్ నటిస్తున్న సంగతి తెలిసిందే! ఇప్పటికే చిత్రానికి సంబంధించిన 50 శాతం కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తయినట్లు తెలిసింది.