ప్రమాదాన్ని పసిగట్టి మహిళను కాపాడిన లేడీ కానిస్టేబుల్‌.. సెల్యూట్‌ చేసిన రైల్వే శాఖ

కదులుతున్న రైలును ఎక్కబోయిన మహిళ పట్టుతప్పి రైలు కింద పడబోయింది. ఇంతలో చిరుతలా దూసుకొచ్చిన ఆర్పీఎఫ్‌ లేడీ కానిస్టేబుల్‌ ప్రయాణికురాలి పక్కకు లాగేసింది. ఆమె ప్రాణాలను రక్షించింది. రెప్పపాటులో జరిగిన ఈ ‘గ్రేట్‌సేవ్‌ సీన్‌’ సీసీ టీవీ లో రికార్డ్‌ అయింది. ఈ వీడియోను సెంట్రల్‌ రైల్వే తమ అధికారిక ట్వీట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. దీంతో ఆ లేడీ కానిస్టేబుల్‌పై సోషల్‌ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని శాండ్‌హర్స్ట్‌రోడ్ స్టేషన్‌లో గురువారం మధ్యాహ్నం 50 ఏళ్ల మహిళా ప్యాసింజర్ బద్లాపూర్ వెళ్తోన్న లోకల్ ట్రైన్ లోని మహిళా జనరల్ కోచ్‌లోకి ఎక్కడానికి ప్రయత్నిస్తోంది.

A Lady Conistable Saved a Woman Life - Suman TV

అయితే, ఈ క్రమంలో ఆమె ట్రైన్ ఎక్కుతూ కిందపడిపోయింది. అయితే, సదరు మహిళా ప్యాసింజర్‌ను రైలు కదలడం ప్రారంభించగానే దాన్ని ఎక్కడానికి ప్రయత్నించడాన్ని కొంచెం దూరంలో ఉన్న మహిళా కానిస్టేబుల్ గ్రహించింది. అంతే, ఏం జరుగబోతోందో ముందే గ్రహించిన కానిస్టేబుల్ మెరుపు వేగంతో స్పందించింది. ట్రైన్ పట్టుకొని వేలాడుతూ రైలు కింద పడబోతున్న ప్రయాణికురాలిని గట్టిగా వెనక్కిలాగి సేవ్‌ చేసింది. ఇలా ప్రమాదాన్ని ముందే పసిగట్టి మెరుపు వేగంతో స్పందించి ఒక నిండు ప్రాణం కాపాడిన ఆ లేడీ కానిస్టేబుల్‌ పేరు సప్నా గోల్కర్‌. ఈ ఒక్క వీడియో ఇప్పుడు గోల్కర్ పేరును సోషల్‌ మీడియాలో వైరల్‌ చేసింది.