ట్రెండింట్ మార్కెటింగ్ మేనేజర్ ఈ కూరగాయల వ్యాపారి!..

పెద్ద పెద్ద వ్యాపారులు అయితే తమ బ్రాండ్లను ఏదో ఒక రకంగా ప్రమోట్ చేసుకుంటారు. రకరకాల ఆఫర్లు పెడతారు.. లేదంటే స్టార్లను ప్రమోషన్ కోసం హైర్ చేసుకుంటారు. అయితే, సాధారణ వ్యాపారుల వైపు ఎవరూ చూడరు. వారి షాపుకు ఏదైనా ప్రత్యేకత ఉంటేనే కస్టమర్లు ఆకర్షితులవుతారు. వ్యాపారం చేయడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. ముఖ్యంగా కస్టమర్లను ఆకట్టుకోడానికి వ్యాపారులు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారు. టీవీ ప్రకటనలతో కస్టమర్లను తమ షాపులకు రప్పించుకుంటారు. రకరకాల ఆఫర్లతో ఊరిస్తారు. దీంతో అంతా అటే క్యూ కడతారు. అయితే, సాధారణ వ్యాపారులను ఎవరూ పట్టించుకోరు. వారి షాపుకు ఏదైనా ప్రత్యేకత ఉంటేనే కస్టమర్ల కన్ను పడుతుంది. జార్ఖండ్‌‌లోని దన్‌బాద్‌లో నివసిస్తున్న ఈ కూరగాయల వ్యాపారి పేరు రితేష్ పాండే. రోడ్డు మీద కాయగూరలు అమ్మే ఈ వ్యాపారికి కూడా ఓ ప్రత్యేకత. తెలుగులో ఖైదీ నెం 786 పాట స్టైల్లో – అటు అమలాపురం సాంగ్ లో గోంగూర కరేపాకు పాట లెక్క వీధుల్లో తిరక్కుండా తన చుట్టు కష్టమర్లని రప్పించుకోవడం ఇతగాడి స్పెషాలిటీ.

768 512 11094229 411 11094229 1616301226309

ఇతడు చిందేస్తూ చిక్కెడు కాయలు.. డ్యాన్స్ చేస్తూ దొండ కాయలు.. పాటలతో పాలకూర.. అమ్మేస్తాడు. అందుకే అతడిని అంతా ‘చుల్‌బుల్ పాండే’ అంటారు. ఇది దబాంగ్ సినిమాలో పాత్ర. తలకు టవల్ కట్టుకుని.. సన్ గ్లాసెస్ పెట్టుకుని.. ‘ఆజావ్ భాయ్ సబ్జీ లేలో’ అనే ప్రత్యేకమైన పాటకు చిందులేస్తూ కూరగాయలను విక్రయించడం ఇతడి స్టైల్. ఇతడు డ్యాన్స్ చేస్తూ కూరగాయలు అమ్ముతున్న వీడియో ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూస్తే మీరు కూడా ఫిదా అవుతారు. పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్న ఓ యువతి ఈ వీడియో తీసింది. ఇప్పుడు నెటిజనులంతా రితేష్‌కు అభిమానులైపోయారు.